అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ తాలిబాన్.. ఆఫ్ఘనిస్తాన్ లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నెలకు పై ఆఫ్ఘన్ ను చెరబట్టేందుకు భీకర దాడులతో విరుచుకుపడిన తాలిబాన్లు.. లెక్కలేనంత మంది ఆఫ్ఘన్లను పొట్టనబెట్టుకున్నారు. ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఏకంగా తాలిబాన్ల దెబ్బకు దేశం విడిచి పరారయ్యారు. ఒక్కొక్క ప్రాంతాన్నే తమ స్వాధీనంలోకి తీసుకుంటూ వచ్చిన ఆఫ్ఘన్ ప్రస్తుతం దేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలను తన వశం చేసుకుంది. అయితే తాలిబాన్లకు ఆది నుంచి చుక్కలు చూపిస్తున్న పంజ్ షీర్ విషయంలో మాత్రం తాలిబాన్లకు ఇంకా పట్టు దొరకలేదనే చెప్పాలి. పంజ్ షీర్ గవర్నర్ కార్యాలయంపై తాలిబాన్ల జెండా ఎగిరినా.. అక్కడి నార్తర్న్ అలయెన్స్ అధినేత అహ్మద్ మసూద్.. పంజ్ షీర్ ఇంకా తమ స్వాధీనంలోనే ఉందని, తాలిబాన్లపై తాము ఇంకా పోరాటం సాగిస్తూనే ఉన్నామని ప్రకటించారు.
11 మందితో తాలిబాన్ సర్కారు
పంజ్ షీర్ పై ఇంకా పూర్తి స్థాయి పట్టు రాలేదన్న వార్తల నేపథ్యంలో తాలిబాన్లు ఏకంగా ఆఫ్ఘన్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రధానిగా ముల్లా మహ్మద్ హసన్, ఉప ప్రధానిగా ముల్లా బరాదర్, హోంశాఖ మంత్రిగా అసదుద్దీన్ హక్కానీ, రక్షణ శాఖ మంత్రిగా ముల్లా యాకూబ్, ఆర్థిక శాఖ మంత్రిగా హిదయతుల్లా బదిరీలు వ్యవహరిస్తారని తాలిబాన్ సంచలన ప్రకటన చేసింది. ప్రధాని సహా మొత్తం 1 మందితో కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన తాలిబాన్లు..ఈ ప్రభుత్వం తాత్కాలికమైనదేనని, పూర్తి స్థాయిలో కొత్త కేబినెట్ ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. గతంలోనే తాలిబాన్ల పాలన ఎలా ఉంటుందో చవిచూసిన ఆఫ్ఘన్ ప్రజలు ఇప్పుడు కొత్తగా మళ్లీ తాలిబాన్ పాలన మొదలు కావడంతో బెంబేలెత్తిపోతున్నారు.
Must Read ;- ఆఫ్ఘన్ హీరో గడ్డ తాలిబాన్ల వశం











