ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజునే గత టీడీపీ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతికి పాల్పడింది.. నిర్మాణంలో ఉన్న అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలపై రివర్స్ టెండర్స్ వేసి తక్కువ నిర్మాణ వ్యయంతో ప్రాజెక్టులు నిర్మిస్తాము అని చెప్పారు. కాగా జగన్ పాలన పగ్గాలు చేపట్టి రెండేళ్ళు దాటినా గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులలో ఎక్కడా కూడా అవినీతి జరిగినట్లు నిరూపించకపోయారు.
ముక్త్యాల టు వేదాద్రి
గత టీడీపీ ప్రభుతం కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామం వద్ద చేపట్టిన ముక్త్యాల లిఫ్ట్ ఇరిగేషన్ పథకం రూ.489 కోట్ల వ్యయంతో 386 క్యూసెక్కుల నీటిని 120 రోజులపాటు ఎత్తిపోతల ద్వారా నీరు అందించాలని భావించారు. ఇందులో భాగంగా పులిచింతల డ్యామ్ దిగువన ముక్త్యాల గ్రామం వద్ద పంపు హౌస్ ను నిర్మించాలని నిర్ణయించారు. కాగా ఈ ఎత్తిపోతల పథకం ద్వారా జగ్గయ్యపేట మండలం తో పాటు చుట్టుపక్కల 38,627 ఎకరాలు సాగులోకి రానున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ముక్త్యాల ప్రాజెక్టును పేరుతో పాటు స్థలం మార్చి కృష్ణా జిల్లా, జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద వైఎస్సార్ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసి గత సంవత్సరం ఆగస్టులో ప్రారంభించారు.
జగన్ అసమర్థత వల్లే..
రివర్స్ టెండరింగ్ తో కాలయాపన చేసి చివరకు గత టీడీపీ ప్రభుత్వం కేటాయించిన రూ.489 కోట్ల వ్యయంతో నిర్మిచాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్న కాంట్రాక్ట్ సంస్థ ఏడాది క్రితం పనులు ప్రారంభించి 30 శాతము పనులు పూర్తిచేసి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని పనులు నిలుపుదల చేసి తట్టా బుట్ట సర్దుకొని పోయింది. అక్కడ ఉన్న ఉద్యోగులు వేరే ప్రాంతాలకు వెళ్లినట్టు, అక్కడ కేవలం ఒక సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఉన్నట్టు సమాచారం. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు రూ.59 వేల కోట్లతో 19 ప్రాజెక్టులు పూర్తి చేసి 2 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 40 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణతో నీరు అందించారు. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటిపోతున్నా ఒక ఎకరానికి నీరు అందించకపోగా.. వేదాద్రి ఎత్తిపోతల పథకానికి బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదార్లు పనులు నిలిపి వెళ్లిపోవడం జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం అని విశ్లేషకుల అభిప్రాయం.











