రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడొక ఉద్యమమై సాగుతోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మొక్కలు నాటుతూ.. ఈ ఉద్యమాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నేడు తన పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి నడుం బిగించారు.
వైజాగ్ కు దగ్గరలోని అరకులో గాలిసంపత్ చిత్ర బృందంతో కలిపి అనిల్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో యంగ్ హీరో శ్రీవిష్ణు, నిర్మాత యస్.కృష్ణ, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. తన మిత్రుడు, శ్రేయోభిలాషులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని అనిల్ రావిపూడి కోరారు.
Must Read ;- నాగార్జున, అఖిల్ లతో అనిల్ రావిపూడి ఏంచేస్తారో?











