అఖిల్ కెరీర్ మీద అక్కినేని నాగార్జున దృష్టి పెట్టినట్టే కనిపిస్తోంది. ఓ సూపర్ సక్సెస్ ను తన పుత్ర రత్నానికి అందించాలన్న తాపత్రయం నాగ్ కు ఉంది. సరైన టైమ్ రాకపోవడం వల్లే అఖిల్ వెనకబడ్డాడన్న అభిప్రాయం ఆ కుటుంబ సభ్యుల్లో ఉంది. అందువల్ల ఓ మల్టీస్టారర్ సినిమా చేయాల్సిందే అన్న నిర్ణయానికి నాగ్ వచ్చేసినట్టే కనిపిస్తోంది. అందుకే అనిల్ రావిపూడిని సంప్రదించినట్టు సమాచారం.
ఇంతకుముందు ‘మనం’ సినిమాలో కూడా అఖిల్ చివరలో కనిపిస్తాడు. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి ఇచ్చిన కథ కూడా నాగ్ కు నచ్చిందని, వెంటనే షూటింగుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం.
అనిల్ రావిపూడి ఎఫ్ 3 ప్రకటించినా ఇప్పట్లో అది సెట్స్ మీదకు వెళ్లే సూచనలు కనిపించడంలేదు. ‘సరిలేరు మీకెవ్వరు’ తర్వాత నుంచి అనిల్ స్క్రిప్టు వర్క్ లోనే ఉన్నారు. ఎఫ్ 3 స్ఠానంలో ఈ మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. నాగ్ ‘వైల్డ్ డాగ్’ నుంచి, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ నుంచి నేరుగా అనిల్ రావిపూడి ప్రాజెక్టులోకి అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
AlsoRead ;- సంక్రాంతి సెంటిమెంట్ ను వదిలిపెట్టని అనిల్ రావిపూడి











