టాలీవుడ్ లో ఒక్క పరాజయం కూడా లేకుండా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి. మొదటి సినిమా ‘పటాస్’ నుండి ఎర్లియర్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ వరకూ వరుస హిట్లను సాధించి మిగతా దర్శకులకు సవాలు విసురుతున్నాడు అనిల్. నేడు అనిల్ రావిపూడి పుట్టినరోజు. ఆయన ఒక ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పాడు. తన మొదటి సినిమాకు అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ కు, అనిల్ కృతఙ్ఞతలు తెలిపాడు. అలాగే దిల్ రాజు కూడా తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని, వ్యక్తిగతంగా ఆయనంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని తెలిపాడు అనిల్ రావిపూడి.
ఇక తన సినీ జీవితంలో ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘సరిలేరు నీకెవ్వరు’ చాలా ప్రత్యేకమైన సినిమాలని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి . ముఖ్యంగా మహేష్ బాబుతో చేసిన సినిమాతో తనకు మంచి గుర్తింపు వచ్చిందని, షూటింగ్ సమయంలో మహేష్ తనకు మంచి సపోర్ట్ ఇచ్చాడని తెలిపాడు. తను ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కథను 45 నిమిషాలు మహేష్ కు చెప్పగానే మనం కలిసి సినిమా చేయబోతున్నాం అని అన్నారని,. ఆ నిమిషం తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయని, ఏ కొత్త దర్శుకుడికైనా మహేష్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేయాలి అనేది ఒక కలని, అలాంటిది తనకు ఇంత తొందరగా అవకాశం వస్తుందని అనుకోలేదని,
అప్పుడే నిర్ణయించుకున్నానని మహేష్ కు ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇవ్వాలని, అదే జరిగింది అని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. మళ్ళీ తను మహేష్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. మహేష్ కూడా తనకు హిట్ ఇచ్చిన దర్శకులకు మరో ఛాన్స్ ఇస్తాడు. దర్శకుడు అనిల్ రావిపూడితో మరలా సినిమా చేస్తానని ఇప్పటికే మహేష్ చెప్పాడు కూడా. వీరిద్దరి కలయికలో మరో సినిమా రావాలని అభిమానులు గట్టిగానే కోరుకుంటున్నారు. వారి కోరిక తీరుతుందో లేదో చూడాలి మరి.
Must Read ;- మెగాస్టార్ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్న దిల్ రాజు











