2019లో జరిగిన ఎన్నికలలో 151 సీట్ల అత్యంత భారీ మెజార్టీతో ఏపీలో అధికారం దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్ సీఎంగా సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నాడు. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, కరోనా లాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా జగన్ సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు ఇస్తూనే పోతున్నాడు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు మేనిఫెస్టోలో పెట్టారు అందుకే ఇస్తున్నారని మద్దతు తెలపగా మరి కొందరు ఆర్థిక సంక్షోభం దిశగా ఏపీ నడుస్తుందని విమర్శలు చేస్తున్నారు.
అప్పులకు వడ్డీ కట్టాలన్నా మరో పెద్ద అప్పు తెచ్చుకోవాలని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ జగన్ ఎఫ్ఆర్‌బీఎం (ద్రవ్య బాధ్యత, బడ్జెట్ మేనేజ్‌మెంట్) క్రమశిక్షణ పరిమితిని దాటేశారు. దీనివల్ల మనకు వడ్డీ రేట్ పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్నా అప్పు తెచ్చుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ ఆదాయం 55 వేల కోట్లు అయితే ఉచిత వరాలు 50 వేల కోట్లు. ఇలాగె కొనసాగితే రాష్ట్రం దివాళ తీస్తోంది. దివాళా తీసిన రాష్ట్రానికి కేంద్రం సాయం చెయ్యదు. కానీ పేదలకు ఉచిత చదువు, వైద్యం, బియ్యం, కరెంటు. అంతా ఉ..చి..తం..గా ఇవ్వడం జగన్ కు లాభం చేకూర్చుతోందని ప్రముఖ పోలింగ్ ఏజెన్సీ ‘వీడీపీ అసోసియేట్స్’ సంస్థ ఓ సర్వేని విడుదల చేసింది.
సర్వే ఫలితాలు
మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పనిని జగన్ అమలు చేస్తుండటంతో వైఎస్ జగన్ కు మెజారిటీ ప్రజలు జైకొట్టారని ‘వీడీపీ అసోసియేట్స్’ సంస్థ తెలిపింది. గత ఎన్నికలలో 52.97 శాతం వైసీపీ సాధించింది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే వైసీపీకి అదనంగా మరో +3.02 ఓటింగ్ శాతం పెరగనుంది. దీంతో 55.99 శాతం ఓటింగ్ తో వైసీపీ రాష్ట్రంలో 155 సీట్లను సాధించవచ్చని ఆ సర్వే అభిప్రాయపడింది. సీఎంగా ఎవరు? కావాలనే ప్రశ్నకు జగన్ కు 53.40 శాతం మంది మద్దతు తెలపడం విశేషం. చంద్రబాబుకు 40.60, పవన్ కళ్యాణ్ కు 3.90, పురందేశ్వరికి 1.10, కన్నా లక్ష్మీనారాయణకు 1.00 శాతం మంది మద్దతు తెలిపారు.
టీడీపీ పరిస్థితి ఆశాజనకం
2019 ఎన్నికలలో 23 సీట్లకే పరిమితమైన టీడీపీకి ‘వీడీపీ అసోసియేట్స్’ జరిపిన సర్వే ఊరట ఇచ్చిందని చెప్పక తప్పదు. గత ఎన్నికలలో 40.06 ఓటింగ్ శాతం పొందిన టీడీపీ తాజా సర్వేలో కూడా +0.89 శాతం పెంచుకుంది. దీంతో మొత్తం మీద టీడీపీకి 40.95 ఓటింగ్ శాతం రానున్నట్లు ఆ సర్వే తెలిపింది. ఓటమితో పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి వెళ్లినా టీడీపీ సంస్థాగత ఓట్ ఎటూ పోలేదని ఈ సర్వే బయట పెట్టింది. రాష్ట్రంలో తెలుగుదేశం లేకుండా చేయాలని జగన్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా టీడీపీకి మద్దతు తెలుపుతున్న వారి సంఖ్య పెరగడం ఓ రకంగా జగన్ కు డేంజర్ బెల్స్ అని చెప్పక తప్పదు.
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, అనంతపురం జిల్లాలో టీడీపీ అధికార పార్టీతో పోటాపోటీగా ఉండటం గమనార్హం. గత ఎన్నికలలో టీడీపీ మెరుగైన ఫలితాలను చూపిన ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీ క్షీణించింది. రాయలసీమ జిల్లాలో వైసీపీ మరోమారు తన సత్తా చాటగా ఉత్తరాంధ్ర జిల్లాలో టీడీపీ తమ ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు ‘చంద్రబాబు చివరి నిమిషం వరకు ఓటమి ఒప్పుకోరు. ప్రతికూల పరిస్థితులలోనూ ఫినిక్స్ పక్షిలాగా పోరాడుతాడు’ ఈ మాటలను నిజం చేస్తూ చంద్రబాబు ప్రతిపక్షంలో కూడా పోరాట పటిమ విడవలేదని అర్ధమవుతోంది.
జనసేన గ్రాఫ్ పడిపోయింది
పవన్ కళ్యాణ్ ‘జనసేన’ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. గత ఎన్నికలలో 3.56 శాతం మద్దతు పొందిన జనసేన 18 నెలలో -1.97 మంది మద్దతు కోల్పోయింది. ఎన్నికలలో ఓటమి తరువాత పవన్ కళ్యాణ్ అడుగులు, ప్రణాళికలు ఈ పతనానికి కారణమయ్యాయి. ఏపీలో పాగావేయాలన్న కమలనాధుల ఆశలకు ఈ సర్వే ఫలితాలు షాక్ ఇచ్చాయి. గత ఎన్నికలలో 2.20 శాతం మంది మద్దతు తెలపగా 18 నెలల కాలంలో అదనంగా 1.36 శాతం మంది మద్దతు తెలిపారు. మొత్తం మీద బీజేపీ +జనసేన కలిపినా 5 శాతం మించిక పోవడం గమనార్హం.
Andhra Pradesh Opinion Poll on one and half year of Jagan Mohan Reddy Government
Vote Share Projection of parties compared to 2019 Assembly pic.twitter.com/ec1jUAMneI— VDPAssociates R&D (@vdpa_research) October 10, 2020
Andhra Pradesh Opinion Poll-2020
Voting Preference of AP Voters if Assembly Election is held now(Change from 2019 Election)
YSRCP-52.97%(+3.02)
TDP-40.06%(+0.89)
Janasena-3.56%(-1.97)
BJP-2.20%(+1.36)
Others-1.21%(-3.3) pic.twitter.com/al27t2TE8q— VDPAssociates R&D (@vdpa_research) October 10, 2020
Andhra Pradesh Opinion Poll
Who would you want as Chief Minister if Assembly election is held now?
YS Jagan Mohan Reddy-53.40%
N.ChandraBabu Naidu-40.60%
Pawan Kalyan-3.90%
Daggubati Purandeswari-1.10%
Kanna Lakshminarayana-1.00% pic.twitter.com/0SifSN677f— VDPAssociates R&D (@vdpa_research) October 10, 2020