వైసీపీకి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు.. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు.. ఆయన రాజీనామా వెనక అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం జరుగుతోంది.. వైసీపీ నుండి బయటకు వచ్చే ముందు విజయసాయి రెడ్డి ముందుగా బీజేపీ గడప తొక్కారట.. హస్తినలో ఆయనకు మంచి రాజకీయ పరిచయాలు ఉన్నాయి.. 2014 – 19 మధ్య కాలంలో కమలనాధులు… ఏపీలో టీడీపీకి కటీఫ్ చెప్పి, వైసీపీకి చేరువ కావడంలో కీలక పాత్ర పోషించింది విజయసాయి రెడ్డి అని చెబుతారు రాజకీయ పరిశీలకులు.. బీజేపీ హై కమాండ్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనేది ఓపెన్ ఫ్యాక్ట్.. పార్లమెంట్ లాబీల్లో విజయసాయి రెడ్డిని ప్రధాని మోదీ పలుకరించిన వీడియోలు, ఫోటోలు బాగానే సర్క్యులేట్ అవుతాయి..
ఇదే అనుబంధంతో వైసీపీకి దూరం జరిగిన విజయసాయి రెడ్డి.. ముందుగా బీజేపీకి టచ్‌లోకి వెళ్లారట.. ముఖ్యంగా, కేంద్ర హోమ్ మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షాని కలిసిన ఆయన.. తాను కాషాయ తీర్ధం పుచ్చుకోవాలని భావిస్తున్నారట తన మనసులో మాట చెప్పారట.. విజయసాయి రెడ్డి ఎంట్రీని ఆహ్వానించిన అమిత్ షా, కీలక షరతు విధించారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.. బీజేపీలోకి తీసుకోవడానికి తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని, కానీ, ఏపీలో తమది కూటమి ప్రభుత్వం కనుక టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి NOC.. నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలని సూచించారట అమిత్ షా.. ఇది ఎంతకష్టమో విజయసాయి రెడ్డికి తెలుసు..
గత పదేళ్లుగా విజయసాయి రెడ్డి… టీడీపీ అధినాయకత్వంపై ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్‌పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు.. వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు.. వారిపై బూతులతో, చిల్లర పదాలతో విరుచుకుపడ్డారు.. ఈ కామెంట్స్ పెనుదుమారం రేపాయి.. విజయసాయి రెడ్డి వ్యక్తిత్వాన్ని కూడా కించపరిచేలా సాగాయి ఆ కామెంట్స్.. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి సాగించిన దందా సంగతి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు..
వీటికితోడు జగన్ అక్రమాస్తులు, కేసుల వ్యవహారంలో బిగ్ హ్యాండ్ విజయసాయి రెడ్డిదే.. తెరవెనక కర్త, కర్మ, క్రియ అంతా A2.. విజయసాయి రెడ్డిదే అనేది ఓపెన్ సీక్రెట్.. ఇంత చీకటి చరిత్ర ఉండడంతో, విజయసాయి రెడ్డి ఎంట్రీని చంద్రబాబు నాయుడు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతారు.. ఈ విషయం ఆయనకీ బాగా తెలుసు.. అందుకే, అమిత్ షా ఎన్‌వోసీ కోరినా, విజయసాయి రెడ్డి ఆ దిశగా అడుగులు కూడా వేయలేరు.. ఇటు, తనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపినా, కూటమి నేత చంద్రబాబు నాయుడుని కాదని, విజయసాయి రెడ్డికి జనసేనలోనూ ఎంట్రీ దొరకదు.. దీంతో, వైసీపీ నుండి బయటకు వచ్చిన రాజకీయాలకు శాశ్వతంగా వీడ్కోలు పలికారు…











