వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభ ఎంపీల వరుస రాజీనామాల నుంచి తేరుకోని వైసీపీకి ఎమ్మెల్సీలు సైతం ఒక్కొక్కరుగా హ్యాండిస్తున్నారు. తాజాగా తిరుపతికి చెందిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైసీబీకి బిగ్‌షాక్ ఇచ్చారు. రాత్రికి రాత్రే తిరుపతిలోని తన హాస్పిటల్ నుంచి జంప్ అయ్యారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండడంతో ఆయనపై వైసీపీ నేతలు ఓ కన్నేసి ఉంచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయనకు ఎక్స్అఫిషియో ఓటు ఉంది. సిపాయి వైసీపీకే మద్దతుగా ఉంటారని వైసీపీ నేతలు భావించారు. ఐతే సిపాయి కూడా కార్పొరేటర్ల బాటలోనే కూటమి క్యాంప్‌లోకి వెళ్లిపోయారు. ఐతే తమ ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారంటూ వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం ప్రారంభించారు.
నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతిలో టీడీపీకి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉండేవారు. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున కార్పొరేటర్లు ఫ్యాన్ పార్టీకి గుడ్‌బై చెప్పి కూటమిలోకి జంప్ చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయించడానికి భూమన కరుణాకర్ రెడ్డి తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డితో రెండో డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేయించారు. ఆ పదవిని గెలిపించుకోవడం ఇప్పుడు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఓడితే భూమన రాజకీయంగా దెబ్బతీనే అవకాశాలే ఎక్కువ.
కానీ కార్పొరేటర్ల ఒక్కొరక్కరుగా భూమనకు హ్యాండిస్తున్నారు. సోమవారం డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం బస్సులో వచ్చిన కార్పొరేటర్లు బస్సు దిగగాని తెలుగుదేశం క్యాంపులో చేరిపోయారు. ఐతే తమ కార్పొరేటర్లను టీడీపీ కిడ్నాప్ చేసిందని భూమన వర్గం ఆరోపించింది. ఐతే ఇక్కడే కార్పొరేటర్లు ట్విస్ట్ ఇచ్చారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ వీడియోలు రిలీజ్ చేయడంతో భూమన వర్గం ప్రచారం అంతా ఉత్తదే అని తేలిపోయింది. ఇక ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం కూడా వీడియో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మొత్తంగా తెలుగుదేశం దెబ్బకు తిరుపతిలో వైసీపీ రెక్కలు ఒక్కొక్కటిగా రాలిపోతున్నాయి.
మరోవైపు, ఇప్పటికే ఏడు మునిసిపల్ కార్పొరేషన్లను టీడీపీ కైవసం చేసుకుంది.. జగన్ అయిదేళ్ల పాలనలో చేసిన అక్రమాలు, అరాచకాలపై ఆ పార్టీ కార్పొరేటర్లు, వార్డ్ మెంబర్లే విసుగెత్తిపోయారు.. అందుకే, పెద్ద ఎత్తున ఫ్యాన్ రెక్కలని విరగగొడుతున్నారు.. మూడు రాజధానుల పేరటి చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. ఇటు కంపెనీలు ఆంధ్రాలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారు. తమ స్వప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు నేతలు.. అందుకే, జగన్‌కి గుడ్ బై చెబుతున్నారు ఆ పార్టీ నేతలు… ఏపీని పట్టాలెక్కించాలని తపన పడుతున్న సీఎం చంద్రబాబు నాయుడుకి జై కొడుతున్నారు.. రాబోయే రోజుల్లో మరెంతమంది నేతలు గుడ్ బై చెబుతారో చూడాలి..