ప్రకృతి లేదా దైవశక్తి గొప్పతనం ఏమిటంటే. ఏ తప్పూ తన మీద ఉంచుకోదు. మనుషుల రూపేనా తాను అనుకున్న కార్యాన్ని పూర్తి చేస్తుంది. అధికారమధంతో విర్రవీగే పాలకుడిని పడదోయాలని ఆ శక్తి నిర్ణంచుకున్నప్పుడు.. ఆ పాలకుడిలో మరింత కండకావరం, అహంకారం పెరిగేలా చేస్తుంది. తనకు తిరుగులేదు అన్న భ్రమలోకి అతడిని నెడుతుంది. ఆ మాయలో పడి అహంకారంతో మరిన్ని చేయకూడని ఘోరాలను ఆ పాలకుడి చేతే చేయిస్తుంది. చేస్తున్న దుర్మార్గాన్ని జేజేలు కొడుతూ స్వాగతించేలా మందిమాగదులను ఆ మాయ ఉసిగొల్పుతుంది. ప్రజలందరికి ఆ పాలకుడి దుర్మార్గాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఆ తర్వాతే ఆఖరిన తన శక్తిని ప్రయోగించి కూలదోస్తుంది.
ఇప్పుడు జరుగుతున్నది అదే. జగన్ దుర్మార్గాన్ని మీడియా ఎంతగా చెబుతున్నా ఇంకా అర్థం చేసుకోలేని జనులను ఉన్నారని ఆ దైవ శక్తి భావించి ఉండొచ్చు. అందుకే ఏకంగా చంద్రబాబునాయుడిని జగన్ చేత అరెస్ట్ చేయించి జగన్ తీరును ప్రజలకు చూపించింది. జగన్ ఇచ్చిన పదవులు అనుభవిస్తున్న వారు మాత్రమే జగన్‌ను ఆహా ఓహో అంటున్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ రోజు జగన్ చేసిన పనిని అసహ్యించుకుంటున్నారు.
మొదలుపెట్టిన కార్యంలో ప్రకృతి విజయం తథ్యం. జగన్ పతనం ఖాయం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీడీపీకి ఓటేయని వ్యక్తిగా చెబుతున్నా… జగన్ దుర్మార్గం ముందు అతడిపై ఏ అభిమానం మిగిలే పరిస్థితి లేదు. తొలినుంచి కాంగ్రెస్ వారమైన మాకే చంద్రబాబు జైలులోకి వెళ్తుంటే ఇది కాదు కదా మన రాష్ట్రం చూడాల్సింది అనిపించింది. ఇది టీడీపీ వారికి కష్టకాలమే. కానీ అధికారాన్ని సొంతానికి విచ్చలవిడిగా వాడుతున్న జగన్‌ను ఓడించాలంటే ప్రకృతి కేటాయించిన పాత్రలను కష్టమైనా పోషించాల్సిందే. జైలుకు వెళ్లడం అన్న పాత్రను చంద్రబాబు నిర్వహించాల్సి వచ్చింది. అంతే. ధైర్యంగా ఉండండి. మీకు వీటిని అధిగమించే శక్తిని ఇవ్వాల్సిందిగా ఆ సర్వభూపాలుడైన శ్రీ వెంకటేశ్వరస్వామిని కోరుకుంటూ…