వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి…. అధికారం కోల్పోయినా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయన తాడేపల్లి లేదంటే బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్‌కే పరిమితం అవుతున్నారు.. ప్రజా సమస్యలపై ఆయన పోరాటం చేయడం లేదు.. ప్రతిపక్ష నేత హోదా లేదు కనుక ఆయన ప్యాలెస్ కింగ్‌గా ఇంటికే పరిమితం అవుతున్నారా..?; లేక, కనీసం తనకు ప్రతిపక్ష హోదాకి కావలసినన్ని స్థానాలు ఇవ్వలేదని ప్రజలపై కక్ష కట్టాడో తెలియదు కానీ, ఆయన ప్యాలెస్‌లు దాటి అడుగు కూడా బయటపెట్టడం లేదు.. ఫీజు పోరు, పొగాకు రైతులకు భరోసా లాంటి ఒకటీ రెండు కార్యక్రమాలు చేస్తామని హింట్‌లు ఇచ్చినా ఆ తర్వాత ఆయన ప్రజల మధ్యకు రాలేదు.. ఈ పరిణామం వైసీపీ నేతలకి విస్మయం కలిగిస్తోంది..
అసలు మేటర్ ఇది కాదట.. జగన్ ఎందుకు ప్యాలెస్‌ల నుండి అడుగు తీసి అడుగుపెట్టడం లేదనే అంశంపై సొంత పార్టీలోనే చర్చ జరుగుతోంది.. ఎన్నికలకు ముందు తాను ఏపీకి మహారాజులా వ్యవహరించాడు జగన్.. తాడేపల్లి ప్యాలెస్ గడప దాటి బయటకు వచ్చి ప్రజలతో మమేకమైనది తక్కువ… వచ్చినా పరదాల చాటున తళుక్కున మెరిసి మాయం అయ్యాడు.. ఒక చక్రవర్తిలా భావించాడు తనకు తాను.. ఇదే ఆయనను ప్రజలకు దూరం చేసింది.. ఓట్లకోసం నాడు ఓదార్పు యాత్ర చేసిన జగన్.. నేడు ఆ ప్రజలంటేనే చిరాకు పడ్డాడు.. వారిని దూరం పెట్టాడు.. ఇటు, ఎమ్‌ఎల్‌ఏలు, మంత్రులకి సైతం అందుబాటులో లేకుండా నడమంత్రపు అధికారాన్ని అనుభవించాడు.. ఇవన్నీ గమనించిన ప్రజలు జగన్‌ని ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కారు.. ఓటు పోటుతో రోడ్డున పడేశారు.. కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా నోరు మూయించారు…
ఈ సీన్‌లన్నీ ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు.. అరకిలోమీటర్ దూరానికి కూడా హెలికాప్టర్‌లో విహరించిన జగన్ అరాచకం కళ్లముందే మెదులుతోంది.. వైసీపీ అధినేతపై ప్రజలలో నేటికీ తీవ్ర వ్యతిరేకత ఉంది. అభివృద్ది లేకుండా, కంపెనీలు రాకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కాలరాసి ఆయన చేసిన తుగ్లక్ పాలనను ప్రజల స్మృతి పథం నుండి చెరిగిపోలేదు.. అందుకే, అధికారం కోల్పోయి ఏడాది అవుతున్నా… ప్రభుత్వంపై పోరాటం అని ప్యాలెస్ నుండి పాంఫ్లెట్‌లు, సోషల్ మీడియా స్టిక్కర్లు,పోస్టర్లు పంపుతున్నాడే కానీ, కాలు కదపడం లేదు. అడుగు వేయడం లేదు..
వైసీపీ పుట్టగతులు ప్రశ్నార్ధకమైన ఈ ఎన్నికల తర్వాత గత 12 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటన, ప్రజల నుండి సమాచారం సేకరించిన ఓ నేత.. అప్పుడే ప్రజల మధ్యకు రావొద్దని, పర్యటనలకు దూరంగా ఉండాలని జగన్‌ని సలహా ఇచ్చారని ప్యాలెస్ వర్గాల నుండి అందుతోన్న లీక్.. జగన్ బయట అడుగుపెట్టినా ప్రయోజనం ఉండదని, కొంత కాలం రికార్డెడ్ ప్రెస్ మీట్‌లకే పరిమితం అవ్వాలని జగన్‌కి, ఆయన కోర్ టీమ్‌కి సదరు నేత విజ్ఞప్తి చేశాడని సమాచారం.. ఇటీవల తాను చేయించిన పలు సర్వేలను కూడా వారి ముందు పెట్టి, కూటమి సర్కార్‌పై ప్రజలలో అనూహ్య ప్రజాదరణ ఉందని, కొంతమంది ఎమ్‌ఎల్‌ఏలు తప్పులు చేస్తున్నా ప్రభుత్వంపై ఓవరాల్‌గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉందని అంకెలతో సహా లెక్కలు ఆవిష్కరించాడని తెలుస్తోంది.. మరి, ఇంతటి భారీ వ్యతిరేకత నుండి జగన్ ఎలా బయటపడతాడో ఎప్పుడు ప్రజల మధ్యకు వస్తాడో అనేది ఆసక్తికరంగా మారుతోంది..