వైసీపీ నేతలకు ఏం పాలుపోవడం లేదు. ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ కూటమి సర్కార్‌పై విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ లోకేష్‌ను కెలికి మరీ తన్నించుకున్నారు. తాజాగా టెన్త్ ఎగ్జామ్ పేపర్ల మూల్యాంకనంలో తప్పులు జరిగాయని, లోకేష్ ఆ శాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారని ట్వీట్ చేశారు జగన్. ఐతే దీనికి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
జగన్‌కు కౌంటర్ ట్వీట్ చేశారు లోకేష్. ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలంటూ చురకలు అంటించారు లోకేష్. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పేనంటూ ముఖం మీద కొట్టినట్లుగా జవాబు చెప్పారు లోకేష్. గడిచిన ఐదేళ్ల పాలనలో విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన తీరుపై జగన్‌ను ఎండగట్టారు లోకేష్.
యూనిఫామ్ దగ్గర నుంచి చిక్కీ వరకు అన్నింటికీ మీ పేరు పెట్టుకుని ఇప్పుడు విలువల గురించి మాట్లాడడం సరికాదని జగన్‌కు సూచించారు లోకేష్. ఇంటర్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం రద్దు, ఉచితంగా ఇచ్చే టెక్ట్స్ బుక్స్ స్కీమ్‌ను రద్దు చేసిన జగన్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు లోకేష్. జీవో 117, ఇతర అసంబద్ధ నిర్ణయాల కారణంగా గడిచిన ఐదేళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ బడి బాట పట్టిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు లోకేష్. విద్యార్థులను సిద్ధం చేయకుండానే జగన్ CBSE తీసుకోచ్చారన్న లోకేష్..విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని CBSE సిలబస్‌ను వాయిదా వేశామన్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను సిద్ధం చేసిన తర్వాతే CBSE సిలబస్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఇక పదో తరగతి మూల్యాంకనంలో అన్యాయం జరిగిందని భావిస్తే రీవెరిఫికేషన్ కోరడం కొత్తగా వచ్చిన విధానం కాదన్నారు లోకేష్. ఈ ఏడాది 45 లక్షల 96 వేల 527 మంది జవాబు పత్నాలను మూల్యాంకనం చేశామన్నారు లోకేష్. 99.75 శాతం కచ్చితత్వంతో మూల్యాంకనం జరిగిందన్నారు లోకేష్. మానవ తప్పిదం 0.25 శాతం మాత్రమేనన్నారు. వైసీపీ హయాంలో ఈ విషయాలను సైతం బయటపెట్టలేదని, వాస్తవాలను మరుగున పెట్టి కూటమి సర్కార్‌పై బురద చల్లడం సిగ్గుచేటంటూ జగన్‌పై మండిపడ్డారు. ఇక పేపర్లు లీకయ్యాయన్న జగన్ ఆరోపణలను తిప్పికొట్టారు జగన్. గ్రూప్ – 1 లాంటి కీలకమైన పేపర్లను హ్యాయ్ లాండ్ రిసార్ట్‌లో వాచ్‌మెన్లతో పేపర్లు దిద్దించింది మీరు కాదా అంటూ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు లోకేష్. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడింది వైసీపీ సర్కారేనని లోకేష్ ఫైర్ అయ్యారు.