హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ కోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఆరేళ్ల తరవాత వైసీపీ అధినేత జగన్.. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు హాజరయ్యాడు.. ఇదే కోర్టుకి అదే సమయంలో ఆయన సోదరి, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత కూడా హాజరయయారు.. కోర్టు ప్రాంగణంలో అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారు.. అయినా చెల్లిని పలకరించకుండా సైలెంట్‌గా వెళ్లిపోయాడు జగన్.. అన్న సైలెంట్‌గా ఉండడంతో సోదరి సునీత సైతం మౌనంగా వెళ్లిపోయారు..
తండ్రి వివేకానంద రెడ్డి హ*త్య కేసులో సీబీఐ దర్యాప్తును కొనసాగించాలన్న పిటీషన్‌పై వాదనల కోసం సునీత ఇవాళ కోర్టుకు వచ్చారు.. ఇటు, జగన్ సైతం నేడు తన అక్రమాస్తుల కేసు విచారణ కోసం అక్కడికి చేరుకున్నారు.. తన తండ్రి ఆత్మకి శాంతికి కలగాలని, తన తండ్రిని అత్యంత దారుణంగా చం*పిన వారికి తగిన శిక్ష పడాలిన ఆమె ఆరేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. కోర్టు చెట్టు కింద ఆమె కూర్చున్న విజువల్స్ గతంలో వివేకా అభిమానులని కంటతడి పెట్టించాయి. న్యాయం కోసం సునీత చేయని పోరాటం లేదు.. ఇటు, అన్న జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనని కలిసి తన గుండె శోషని వినిపించుకోవాలని భావించారు.. సీఎం స్థానంలో ఉన్న జగన్… కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు.. అక్కడితో ఆగకుండా ఎన్నికల ప్రచారంలో బాబాయ్ వివేకాని ఆయన కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ చం*పారని, ఆస్తుల కోసమే హ*త్య చేశారని కామెంట్ చేశారు.. దీంతో, మనసు విరిగిన సునీత.. తండ్రి హ*త్య కేసులో తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేసింది..
ఇటీవల వివేకా హ*త్య కేసుపై సుప్రీం సీనియర్ లాయర్ సిద్దార్ధ్ లూథ్రా.. సునీత తరఫున వాదనలు వినిపిస్తున్నారు.. దీంతో, ఆ కేసులో మళ్లీ కదలిక చోటు చేసుకుంటోంది.. కోర్టు అనుమతి ఇస్తే.. తిరిగి విచారణ ప్రారంభిస్తామని సీబీఐ తెలిపింది.. ఇదే అంశంపై సునీత మరోసారి సీబీఐ కోర్టుకు వచ్చారు.. ఇటు, జగన్ తన కేసులో విచారణ కోసం హాజరయ్యారు..
సునీత ఎదురుపడినా, ఆమెని పలుకరించకుండా, కనీసం చూడనట్లు జగన్ వ్యవహరించడం అక్కడున్న వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులని సైతం ఆశ్చర్యపరిచింది.. రాజకీయంగా సునీత తనకు డ్యామేజ్ చేస్తోందని భావించారో, లేక సోదరుడు అవినాష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులని కాపాడుతున్నందున సునీతతో అవసరం లేదనుకున్నారో తెలియదు కానీ, పరిచయం లేని వ్యక్తితో వ్యవహరించినట్లు మిన్నకుండా ఉండిపోయాడట జగన్.. మొత్తమ్మీద, వైసీపీ అధినేత చేసిన తప్పులు ఆయనని కోర్టు బయటే కాదు, కోర్టులోపల, కోర్టు పరిసరాలలోనూ వెంటాడుతూనే ఉన్నాయి.











