వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మరోసారి అధికారం దక్కించుకోవడానికి ఎన్నో వ్యూహాలు ఎంచుకుంటున్నారు.. ఇప్పటికే, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు బనాయించి సుమారు 50 రోజులుగా జైలుకే పరిమితం చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.. జగన్ సర్కార్‌పై చంద్రబాబు ప్రారంభించిన బస్సు యాత్రకు భారీ స్పందన వచ్చింది.. ఇటు, భవిష్యత్తుకు బాబు గ్యారంటీ అంటూ చంద్రబాబు ఇచ్చిన ఆరు హామీలు కూడా జనాలకి బాగా చేరువయ్యాయి.. వీటికితోడు గత నాలుగన్నరేళ్లుగా జగన్ అనుసరించిన ప్రజా వ్యతిరేక, అభివృద్ధి లేమి విధానాలు ఏపీకి శాపంగా మారాయి.. రాజధాని నిలిచిపోయింది.. పోలవరం ఆగిపోయింది.. ప్రత్యేక హోదా పడకేసింది.. వీటిపై చంద్రబాబు ఏడు పదుల వయసులో అలుపెరగని పోరాటం జరుపుతున్నారు.. వీటిపై ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండడం, ఇటు లేటెస్ట్ సర్వేలలో వైసీపీ, జగన్ ఇమేజ్ గ్రాఫ్ పడిపోవడంతో డైలమాలో పడిన వైసీపీ… బాబు అరెస్ట్ కుట్ర కోణాన్ని తెరమీదకి తెచ్చిందనే చర్చ ఉంది..
చంద్రబాబు జైలులో ఉన్నా.. టీడీపీ యాక్టివిటీ ఏమాత్రం తగ్గలేదు.. ఆయన భార్య నారా భువనేశ్వరి నిజం గెలవాలితో ప్రజల్లోకి వెళుతున్నారు.. ఇది బాగా రీచ్ అవుతోంది.. ముఖ్యంగా మహిళలకు భువనేశ్వరి చేరువ అవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌తో మృతిచెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఆమె పర్యటించనున్నారు.. ఇది వైసీపీపై నెగిటివ్ ప్రభావం చూపుతుందన్న భావనలో ఉన్న వైసీపీ వెంటనే వ్యూహాత్మకంగా పోటీ యాత్రను తెరమీదకు తీసుకువచ్చింది..
భువనేశ్వరి యాత్రకు పోటీగా సామాజిక సాధికారిక యాత్ర పేరుతో వైసీపీ కొత్త కార్యక్రమం చేపట్టింది.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నామనే భావనను ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఎత్తుగడలో ఉన్నారు.. పలు సామాజిక వర్గాలకు మంత్రి పదవులు, ఎమ్‌ఎల్‌సీలు, కార్పోరేషన్ పదవులు కట్టబెట్టారని ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారు.. అయితే, ఇది గతంలోనే బూమరాంగ్ అయింది.. ఏడాదిన్నర క్రితం ఈ యాత్రను మంత్రులతో ప్రారంభించారు జగన్.. ఈ యాత్రలకి ప్రజలను బలవంతంగా తరలించాలని భావించినా కనీస స్పందన లేదు.. దీంతో, మధ్యలోనే నిలిపివేశారు.. బొత్స సత్యనారాయణ నుండి విడదల రజని వరకు మంత్రులంతా అనేక జిల్లాలు పర్యటించినా, పట్టించుకున్న దిక్కు లేదు.. దీంతో, అప్పటికి అర్ధంతరంగా నిలిపివేసింది వైసీపీ హైకమాండ్..
తాజాగా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రకి పోటీగా మరోసారి ఈ బస్సు యాత్రను షురూ చేసింది వైసీపీ.. ఇప్పటికే బుస్సుయాత్ర అని పేరు తెచ్చుకుంది.. ఈ యాత్రకి కూడా ప్రజల నుండి ఎలాంటి మద్దతు లేదనే వాదన తెరమీదకి వస్తోంది.. వైసీపీ నేతలు కూడా పెదవి విరుస్తున్నారు.. మరి, ఈ బుస్సు యాత్రతో జగన్ ఏం సాధించాలనుకుంటున్నారో త్వరలోనే తేలనుంది..