కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది దుర్మరణం పాలయ్యారు. హుబ్లి-ధార్వాడ బైపాస్ రోడ్డులో ఇట్టిగట్టి క్రాసింగ్ వద్ద వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రయాణికులందరూ గోవాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు దావణగెరె నుంచి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.











