తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు నమోదయిన కరోనా కేసులను గురువారం ఉదయం విడుదల చేసింది. రాష్ట్రంలో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,424కు చేరింది. గడిచిన 24గంటల్లో 10 మంది ఈ వైరస్ తీవ్రతతో మరణించారు. మరణించిన వారి సంఖ్య 729కి చేరింది. వైరస్ భారీ నుంచి కోలుకొని 1,195 మంది డిశ్చార్జ్ అయ్యారు.
మొత్తం 97,424 కరోనా కేసులలో 75,186 మంది వైరస్ కోలుకొని డిశ్చార్జి కావడం ఊరటనిచ్చే అంశం. రాష్ట్రంలో 21,509 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో నమోదయిన కేసులలో జీహెచ్ఎంసిలోనే అత్యధికంగా 395 పాజిటివ్ కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 105, రంగారెడ్డిలో 169,కరీంనగర్ లో 101 కేసులు నమోదయ్యాయి. హోమ్ ఐసొలేషన్ లో 15,076 కేసులు ఉన్నాయని తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ 24 గంటల్లో రాష్ట్రంలో 24 వేలకు పైగా పరీక్షలు జరిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 7.97 లక్షలకు చేరుకుంది.










