ఆక్స్ ఫర్డ్-అస్ట్రాజెన్‌కా సంయుక్తంగా వ్యాక్సిన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ప్రపంచంలోనే ధర తక్కువ వ్యాక్సిన్‌గా పేరు గాంచింది. అంతేకాదు.. మూడో దశ ట్రయిల్స్ కూడా విజయవంతంగా పూర్తిచేసిన నేపథ్యంలో బ్రిటన్ మొదటగా కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు అనుమతులు అందించింది. తాజాగా భారత్‌లో ప్రధానమైన వ్యాక్సిన్‌గా కొవిషీల్డ్‌కు అనుమతులు లభించాయి. కానీ, భారత్‌లో ఇంకా వ్యాక్సినేషన్ మొదలుకాలేదు. గత నెల డిసెంబర్ 27వ తేదీన కొవిషీల్డ్ వ్యాక్సిన్ పంపిణీకి అత్యవసర అనుమతులు అందించిన యుకే ప్రభుత్వం.. ప్రకటించిన వారం తర్వాత వ్యాక్సిన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
కొవిషీల్డ్ వ్యాక్సినేషన్ మొదలైంది
ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌కు అనుమతులిచ్చిన యుకే.. ఆ తర్వాతి ప్రధాన్యత కొవిషీల్డ్‌కి ఇచ్చింది. యుకే కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:30 గంటల సమయంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసును 82 ఏళ్ల బ్రియన్ పిన్కర్ అందుకున్నారు. ఈయన కిడ్ని సమస్యతో బాధపడుతున్న వ్యక్తి కావడం గమనార్హం. డయాలసిస్ చికిత్స తీసుకుంటున్న బ్రియన్.. కొవిషీల్డ్ తొలి వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకొచ్చారు. ఆక్స్ ఫర్డ్ తయారుచేసిన వ్యాక్సిన్ మొదటగా తీసుకునే వ్యక్తిగా ఎంపికైనందుకు ఆనందం వ్యక్తం చేశారు బ్రియన్.
'I'm so pleased to be getting the COVID vaccine today and really proud it is one that was invented in Oxford.'
82-year-old Brian Pinker became the first person in the world to receive the new Oxford AstraZeneca vaccine this morning at @OUHospitals. 💉 pic.twitter.com/nhnd3Sx97m
— NHS England and NHS Improvement (@NHSEngland) January 4, 2021
కొవిషీల్డ్ నిర్వహణ ఎలా?
ఫైజర్ వ్యాక్సిన్‌తో పోలిస్తే కొవిషీల్డ్ నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఇది అమెరికా-రష్యా టెక్నాలజీతో తయారుచేసిన టీకా కావడం విశేషం. ఇది జనటికల్లి మోడిఫైడ్ వ్యాక్సిన్. ఇది 21 రోజల వ్యవధిలో రెండు డోసులు అందించాల్సి ఉంటుంది. ఇక టీకా సామర్థ్యం విషయానికొస్తే, 70-90 శాతం వరకు ఉందని ప్రయోగ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అన్ని టీకాల మాదిరిగానే మామూలు ఫ్రిజ్ టెంపరేచర్‌లో ఉంచితే సరిపోతుంది. దీని కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు అవసరం లేదు. ఇన్ని ప్రయోజనాలు కలిగిన వ్యాక్సిన్ అవడం వల్ల ఈ వ్యాక్సిన్‌ను భారత్ కూడా ఆమోదముద్ర వేసింది.
అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..
కరోనాతో పాటు.. కొత్తరకం కరోనా కూడా బ్రిటన్‌లో అనూహ్యంగా విస్తరిస్తోంది. ఫైజర్, కొవిషీల్డ్.. రెండు టీకాలు కలిపి 140 మిలియన్లు ఆర్డర్ చేసింది ప్రభుత్వం. దేశంలోకి ప్రతి ఒక్కరికి టీకా అందించడం బాధ్యతగా భావిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే దాదాపు 5 లక్షల మందికి మొదటి డోసు పూర్తయినట్లుగా తెలుస్తుంది. యుకేలో గత నెల డిసెంబర్ 8న మొదటగా ఫైజర్ వ్యాక్సిన్ అందుకన్న 90 సంవత్సరాల మార్గరెట్ కీనన్ ఆరోగ్య పరిస్థితి సమీక్షించి రెండో డోసు కూడా అందుకున్నారు. ఈ ఘటనతో టీకా రక్షణ గురించిన అనుమానాలకు సమాధానం దొరికినట్టేంది. వ్యాక్సిన్ అందిస్తూ.. కరోనా కట్టడకి ఎంత ప్రయత్నించినా కూడా నేటికి కూడా రోజుకు 50 వేల కరోనా కేసులు నమోదవుతుండడంతో ప్రభత్వం కలపాటుకు గురవుతుంది. మరి కొత్తగా అందివ్వడం మొదలు పెట్టిన వ్యాక్సిన్ వల్లనైనా యుకేలో కరోనా తగ్గుముఖం పడుతుందేమో చూడాలి.