మంచితనాని మరో పేరు.. ఆపద్భాంధవుడు అనే పేరు కరెక్ట్ గా సరిపోయే వ్యక్తి అంటే అందరూ చెప్పేపేరు సోనుసూద్. కరోనా టైమ్ లో కష్టాల్లో ఉన్నవారిని సోనూసూద్ ఎంతగా ఆదుకున్నాడో.. వాళ్లకు అన్నిరకాల ఎంతగా సహకారం అందించాడో తెలిసిందే. రీల్ లైఫ్ లో విలన్ అయిన సోనూ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయ్యాడు. అయితే.. అతను చేసిన సేవలు.. అతనికి దక్కుతున్న గౌరవం చూసి దర్శకనిర్మాతలు ఒక నుంచి సోనుసూద్ ని విలన్ గా కాకుండా హీరోగా చూపించాలనుకుంటున్నారు.
స్వయంగా మెగాస్టార్ చిరంజీవే ఇక నుంచి విలన్ వేషాలు వేయకు.. నిన్ను సినిమాలో కొడితే ప్రేక్షకులు నన్ను తిట్టుకుంటారు అని చెప్పారు. సోనుసూద్ కూడా విలన్ వేషాలు కాకుండా హీరో వేషాలు వేయాలనుకుంటున్నారు. టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో సైతం సోనుసూద్ ని హీరోగా పెట్టి సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. సోనుసూద్ ప్రధాన పాత్రలో ‘కిసాన్’ అనే సినిమాని ఎనౌన్స్ చేసిన డైరెక్టర్ ఇ.నివాస్.
రచయిత-దర్శకుడు రాజ్ షాండిల్య ఈ చిత్రానికి సహకారం అందించనున్నారు. ఈ విషయాన్ని ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా తెలియచేసారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తానన్నారు. బిగ్ బి అమితాబ్ కిసాన్ టీమ్ కి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. దీనికి సోనుసూద్ ధన్యవాదాలు సార్ అంటూ ట్విట్టర్ లో స్పందించారు.
దేశరాజధాని ఢిల్లీలో రైతులు గత కొన్ని రోజులుగా తమ సమస్య పరిష్కారానికై ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో సోనుసూద్ కిసాన్ టైటిల్ తో సినిమా చేస్తుండడం విశేషం.
Also Read: బెల్లంకొండ బాబు సరసన స్టార్ డాటర్ ?
IT’S OFFICIAL… SONU SOOD IN #KISAAN… #SonuSood will head the cast of #Kisaan… Directed by E Niwas… Raaj Shaandilyaa – who made his directorial debut with #DreamGirl – will produce the film… Balance cast will be announced shortly. pic.twitter.com/5MTpWHHKNb
— taran adarsh (@taran_adarsh) January 4, 2021