మాదాపూర్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైయ్యింది. జగద్గిరిగుట్ట ప్రాంతానికి చెందిన నవీన్ కుమార్ గౌడ్ అనే యువకుడు శంకర్ ప్రసాద్ అనే వ్యాపారవేత్త వద్ద గత కొంతకాలంగా డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం శంకర్ ప్రసాద్ కు చెందిన ఫెరారీ కారు టీఎస్ 08 ఎఫ్ పీ 9999 లో తన యజమాని వద్దకు కూకట్ పల్లి నుంచి మాదాపూర్ కు బయలుదేరాడు. అతి వేగంతో కారు నడిపి కారును ఫుట్ పాత్ పైకి ఎక్కిండంతో.. అదే సమయంలో అటుగా వస్తున్న ఏసుబాబు (50) అనే వ్యక్తి కారు కింద పడడంతో అతను అక్కడికక్కడే మరణించగా… జమీల్ అనే మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు డ్రైవర్ నవీన్ కుమార్ ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. నిందితుడిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఆందోళన
ఈ ప్రమాదంలో మరణించిన ఏసుబాబు కుటుంబ సభ్యులు సంఘటన స్థలంలో ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మరణించిన వ్యక్తి పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్దారించారు. ఇతను కొంతకాలంగా మాదాపూర్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు.
Some kind hearted #billionaires in #Hyderabad we have. A #Ferrari @Ferrari crashes and kills a pedestrian in Jubille Hills. Number TS 08 FP 9999. Another injured. None from business family driving. They allowed driver to go around in it. Good quick work by police in naming dr pic.twitter.com/zOB9HFXhkw
— Sriram Karri (@oratorgreat) October 11, 2020











