మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకలో మెగా హీరోలు చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే.. నిహారిక – చైతన్యల పెళ్లి ప్రేమ వివాహమా.? పెద్దల కుదిర్చిన వివాహమా.? అంటే ప్రేమ వివాహం అని వార్తలు వస్తున్నాయి. అందరూ నిహారిక పెళ్లిని పెద్దలు కుదుర్చారనుకున్నారు కానీ.. ప్రేమ వివాహం అని నాగబాబు బయటపెట్టినట్టుగా టాక్ వినిపిస్తోంది. వీరిద్దరూ ప్రేమించుకున్నారట. ఆతర్వాతే పెద్దలకు చెప్పి ఒప్పించారట.

ఈ ప్రేమ పెళ్లిపీటల వరకు రావడం వెనక నిహారిక ప్లానింగ్ చాలా ఉందట. అది ఏంటంటే.. నాగబాబు జూబ్లీహిల్స్ లోని అపోలో జిమ్ లో డైలీ వర్కవుట్ చేస్తుంటారు. అందుచేత నాగబాబుకు దగ్గరయ్యేందుకు జొన్నలగడ్డ చైతన్య అపోలో జిమ్ లో జాయిన్ అయ్యారట. నాగబాబుని ఇంప్రెస్ చేయడం కోసం ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పేవాడట. 2015 నుంచి ఈప్లానింగ్ స్టార్ట్ అయ్యిందట. ఆఖరికి గత సంవత్సరం నిహారిక తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులుకు చెప్పిందట. ఆతర్వాత నాగబాబు.. చైతన్య కుటుంబం గురించి ఆరా తీశారట.
చైతన్య గుంటూరుకు చెందిన రైటర్డ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు. చిరంజీవికి జొన్నలగడ్డ ప్రభాకర్ రావుతో మంచి అనుబంధం ఉండడంతో ఎలాంటి అడ్డంకులు ఏర్పడలేదట. ఈ విషయం తెలిసి చిరంజీవి కూడా వెంటనే ఓకే అన్నారట. అలా.. నిహారిక, చైతన్యల ప్రేమ పెళ్లిపీటల వరకు వచ్చిందని.. ఇది లవ్ మ్యారేజ్ అని నాగబాబు బయటపెట్టారని వార్తలు వస్తున్నాయి. అదీ.. సంగతి.
Must Read ;- నిహారికకు 2కోట్లు ఖరీదు చేసే నగలను గిఫ్ట్ గా ఇచ్చిన పెదనాన్న











