హీరో రానా దగ్గుబాటి ఓ ఇంటివాడు కానున్నాడు. హైదరాబాద్ లో మిహికా బజాజ్ తో ఆయన వివాహం ఆగస్టు 8వతేదీ శనివారం జరగనుంది. పెళ్లి వేడుకలలో భాగంగా ‘హల్దీ ఫంక్షన్’, ‘మెహందీ’ కార్యక్రమాలు సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం తరువాత ఫోటో సెషన్ ను నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో కొత్త జంట అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి, నాగ చైతన్య సతీమణి సమంత హాజరయ్యారు. మెహందీ కార్యక్రమంలో పాల్గొన్న సామ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు. సమంత ధరించిన డ్రెస్ సూపర్ గా ఉండటంతో దాని ధర ఎంతని చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సామ్ ధరించిన డ్రెస్ పై ఓ ఆసక్తికరమైన న్యూస్ వెలుగులోకి వచ్చింది. సమంత కోసం ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ అర్పిత మెహతా ప్రత్యేకమైన దుస్తులను డిజైన్ చేశారు. ఈ డ్రెస్ ఖరీదు సుమారు రూ.1.59 లక్షలని తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ వేడుకకే ఇంత ధర పెట్టిన సామ్ వెడ్డింగ్ కు ఎలాంటి డ్రెస్ వేస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘ఫ్యామిలీ మాన్-2’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. తన కెరీర్ లోనే తొలిసారిగా ఆమె ఈ వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ చేస్తున్నారు.
మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?
ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...










