మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య మూవీ షూటింగ్ లో కాజల్ అగర్వాల్ జాయిన్ కావడం తెలిసిందే. త్వరలో చిరు – కాజల్ పై ఓ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఇందులో చరణ్ నటిస్తున్నారని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఆచార్య థియేటర్లోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అపజయం అనేది లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న కొరటాల ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో ఆచార్య సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ధీమాతో ఉన్నారు అభిమానులు.
ఆచార్య తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది కానీ.. చరణ్ ఇంకా షూట్ లో జాయన్ కాలేదు. తాజా వార్త ఏంటంటే.. జనవరి 11 నుంచి చరణ్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ కానున్నారని తెలిసింది. రెండు షెడ్యూల్స్ లో చరణ్ పాత్ర షూటింగ్ కంప్లీట్ చేస్తారట. ఫిబ్రవరిలో చిరు, చరణ్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి నెలాఖరుకు ఆచార్య మొత్తం షూటింగ్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో చరణ్ పాత్ర దాదాపు అరగంట సేపు ఉంటుందట. ఇక చరణ్ కి హీరోయిన్ కూడా ఉందని వార్తలు వచ్చాయి కానీ.. ఎవరనేది అఫిషియల్ గా ప్రకటించలేదు.
క్రేజీ హీరోయిన్ రష్మిక పేరు గట్టిగా వినిపిస్తుంది. త్వరలోనే చరణ్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే ఎనౌన్స చేయనున్నారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆచార్య 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.
Must Read ;- ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ చేయనున్న సినిమా ఇదే..!