రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డ్రైవర్, కండక్టర్ అక్కడే చనిపోగా.. బస్సు ప్రయాణికుల్లో ఆరుగురు మంటలకు ఆహుతయ్యారు. 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. అజ్మేర్ ప్రాంతానికి చెందిన పలువురు బార్మర్‌లోని బౌద్ద దేవాలయం సందర్శనకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో, అజ్మేర్ నగరానికి తొందరగా చేరుకోవడానికి వేరే దారిలో వెళ్లడానికి గూగుల్ మ్యాప్స్ ఉపయోగించడం వల్ల బస్సు దారి మళ్లింది. బస్సు వెళ్తున్న దారిలో కిందకి వేలాడుతున్న కరెంటు తీగ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది.

అగ్ని ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని దగ్గరలోని జోధ్ పూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 17 మంది తీవ్ర గాయాలతో బాధపడుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మోడీ.. చనిపోయినవారికి సంతాపం తెలియజేశారు.. గాయాలతో చికిత్స తీసుకుంటున్నవారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ప్రధాని సంతాపానికి సంబంధించిన పిఎంఓ కార్యాలయం ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడంతోపాటు.. ట్విట్టర్ ఖాతాలో చనిపోయిన వారికి సంతాపం తెలియజేశారు.
राजस्थान के जालौर में हुए बस हादसे की खबर से अत्यंत दुख पहुंचा है। इस दुर्घटना में कई लोगों को अपनी जान गंवानी पड़ी है। मैं उनके परिवार वालों के प्रति अपनी संवेदनाएं प्रकट करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 17, 2021











