ప్రచారం జరుగుతున్నట్లుగా శశికళ జైలు నుండి అనుకున్న సమయంలోనే విడుదల అయింది. కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరిన శశికళ విడుదల ప్రక్రియను ఆసుపత్రలోను పూర్తి చేశారు.
అక్రమాస్తుల కేసులో 2017 ఫిబ్రవరిలో అరస్టైన శశికళ దాదాపు 4 ఏళ్ల జైలు జీవితం తర్వాత ఈ రోజు (జనవరి 27, 2021) జైలు నుండి విడుదలయ్యారు. ఈ నాలుగేళ్లు పరప్పర అగ్రహారంలో 4 ఏళ్లగా జైల్లో ఉన్న శశికళ.. విడుదలకు కొద్ది రోజుల క్రితమే కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరారు. ఒకానొక దశలో ఆరోగ్య స్థితి బాగా క్షీణించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు, శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందని, మెల్లగా కోలుకుంటున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలియజేశారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కారణంగా విడుదలకు సంబంధించిన ప్రక్రియను జైలులోనే పూర్తిచేశారు. శశికళ విడుదలరోజనే, జయలలిత స్మారక మందిరాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి, పన్నీరు సెల్వం ప్రారంభించారు.
శశికళ మొదటిసారిగా 1996లో డిసెంబర్‌లో జయలలితతో పాటు అరెస్టైయ్యారు. కలర్ టీవీ స్కాంకి సంబంధించిన కేసులో ఆనాడు 30 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది.
Must Read ;- తమిళనాట మోదీకి ‘చిన్నమ్మ’ పెద్దదెబ్బ.. ఏబీసీ న్యూస్-సీ ఓటర్ సర్వే