టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. నేటికి ఆయనపై ఆరోపణలు వినవస్తూనే ఉన్నాయి. దీనిపై ఈటల కూడా స్పస్టత ఇచ్చారు. ఈటల రాజేందర్ పై తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో ఆయన భార్య జమున ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులపై, టీఆర్ఎస్ నాయకులపై జమున మండిపడ్డారు. ముసాయిపేటలో హ్యాచరిస్ కోసం 46 కొనుగోలు చేశామని, నిబంధనల ప్రకారమే భూమి కొన్నప్పటికీ భూములు కాజేశారని ప్రచారం ఎంత వరకు కరెక్ట్ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతకంటే ఎక్కువ భూమి ఉందని నిరూపిస్తే ముక్కును నేలకు రాస్తా..అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం అప్పట్లో పత్రిక కోసం తాము భూమి ఇచ్చినట్టు తెలిపారు. తాము కష్టపడి పనిచేశామని, ఎవరికీ భయపడేది లేదని అన్నారు. ఇప్పటికైనా ఈటలపై దుస్ప్రచారం మానుకోవాలని ఈటల రాజేందర్ భార్య జమున అన్నారు.
జగన్‌ని భయపెట్టిన జువ్వలదిన్నె..!
నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ దగ్గర హడావుడి చేద్దామని వెళ్లిన జగన్‌కు...











