సినిమా ఇక బూతుమయం కాబోతోంది. ఒకప్పుడు మళయాళం సినిమాల్లో బూతు పాళ్లు ఎక్కువ ఉండేవి. వాటికి బ్లూ ఫిలిం జోడించి కొన్ని థియేటర్లలో ప్రదర్శించేవారు. అదే పరిస్థితి ఇప్పుడు పునారావృతమవుతోంది. కాకపోతే ఈ జోడింపులు ఉండవు…అంతా డైరెక్టే. రెండు మూడేళ్లుగా టాలీవుడ్ లో కూడా అడల్ట్ కంటెంట్ సినిమాలకి కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన లిప్ లాక్ లు, సెక్స్ సీన్లు ఇప్పుడు టాలీవుడ్ లో కామన్ అయిపోయాయి. ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ కూడా పాపులర్ అవుతున్న నేపథ్యంలో జనాలు కూడా వాటిలో ఉన్న అడల్ట్ కంటెంట్ బేస్డ్ వెబ్ సిరీస్ లుకు ఫాలోవర్స్ అయిపోతున్నారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో వారు అప్ లోడ్ చేసిన మీర్జాపూర్ అనే అడల్ట్ క్రైమ్ వెబ్ సిరీస్ కి ఆల్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ కోట్లల్లో ఉన్నారు. అమెజాన్ ప్రైమ్ ని రీజనల్ మార్కెట్ లోకి మరింతగా చొచ్చుకుని వెళ్లేలా చేసింది ఈ మీర్జాపూర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మొత్తం భూతులు, వైలెన్స్ తోనే నిండిపోయి ఉంటుంది. అన్ని రీజనల్ భాషల్లోకి మీర్జాపూర్ ని డబ్ చేసిన రిలీజ్ చేశారు అమెజాన్ వారు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన సీజన్ 2ను అక్టోబర్ లో విడుదల చేస్తున్నట్లుగా అమెజాన్ వారు ప్రకటించారు.
ఈ ప్రకటణ వచ్చిన వెంటనే కోట్ల కొద్ది ఉన్న అభిమానులు మీర్జాపూర్ 2 ను అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలంటూ అమెజాన్ వారిని కోరడం మొదలుపెట్టారు. కొందరు అత్యుత్సాహ ఫ్యాన్స్ అయితే భూతులు పెట్టి వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ కి ఎందుకంత క్రేజ్ వచ్చిందా అంటే ఒక్కటే మెయిన్ రీజన్ ఎడాపేడా డైలాగ్స్ మొత్తం బూతులుతోనే నిండిపోయి ఉండటం. అందుకే బూతు బొమ్మని నమ్ముకున్నోడు చాలా త్వరగా పైకి వస్తాడనే సంకేతాలు ఇప్పుడు ఇండస్ట్రీలో వాయు వేగంతో ప్రచారం అవుతున్నాయి. తెలుగులో కూడా అడల్ట్ సినిమాలు ప్రొడక్షన్ ఊపందుకుంది.











