Big Plan Behind Dileep Sunkara :
సుంకర కల్యాణ్ దిలీప్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పాలిటిక్స్ లో కొనసాగుతున్నట్లుగా ఫోజులు కొట్టే ఓ రౌడీ షీటరే మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతారు. దిలీప్ సుంకర రౌడీ షీటరా? అంటే.. స్వయంగా ఆయనే తనపై రౌడీ షీట్ ఉందని చెబుతుంటే అనుమానం అక్కర్లేదు కదా. నిత్యం యూట్యూల్ లో తనదైన శైలి *వంకర* వీడియోలతో హల్ చల్ చేస్తున్న దిలీప్.. ఇప్పుడు కొత్త అజెండాను భుజానికెత్తుకుని.. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి తనదైన వంతు సాయం చేసేందుకు రంగంలోకి దిగినట్లుగా ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి. నోరు తెరిస్తే కులాల కుంపట్లను ప్రస్తావించే దిలీప్..ఇటీవల *సీబీఎన్ చంద్రజ్యోతి* పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకున్నారు. అందులో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను పోలినట్లుగా ఉండే ఓ యాంకర్ ను పెట్టేసుకుని రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలు కమ్మ, కాపుల మధ్య చిచ్చుకు యత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలను చూస్తేనే ఈ విషయం చాలా స్పష్టంగానే అర్థం కాక మానదు.
పవన్ ఫ్యాన్.. జనసేనకు వీడ్కోలు
అదేంటో గానీ.. తాను జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకునే దిలీప్.. జనసేన నుంచి బహిష్కరణ వేటుకు రంగం సిద్ధమైతే.. తానే రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. జనసేనలో ఉంటూనే పవన్ నిర్ణయాలను, ఆ పార్టీ నిర్ణయాలను నిత్యం తెగనాడే రీతిలో వ్యవహరించిన దిలీప్.. నిత్యం యూట్యూబ్, న్యూస్ ఛానెళ్లలో అనుచిత వ్యాఖ్యలు, అసందర్భ వ్యాఖ్యలు చేయడం ద్వారానే వెలుగులోకి వచ్చారు. గతంలో టీడీపీలో కీలక నేతగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్న సాధినేని యామినీ శర్మతో లైవ్ డీబేట్ లో.. ఓ మహిళ అని కూడా చూడకుండా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిలీప్ (Dileep Sunkara) తన చిల్లర మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఆ తర్వాత శ్రీరెడ్డి వ్యవహారంలోనూ దిలీప్ ఓ రేంజిలో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇక శ్రీరెడ్డి అయితే దిలీప్ ను తీవ్ర స్థాయిలో అసభ్యకరంగా మాట్లాడిన వైనం కూడా కలకలం రేపింది. మొత్తంగా ఎక్కడ ఉన్నా, తనదైన శైలి చిల్లర వ్యాఖ్యలతోనే పాపులారిటీ సంపాదించుకున్న దిలీప్.. తను చేసే పనులన్నీ చిల్లరగానే, వంకరగానే ఉంటాయని చెప్పకనే చెప్పేసుకున్నారు.
పిస్టల్ తో పట్టివేత.. రౌడీ షీట్ ఓపెన్
సుంకర కల్యాణ్ దిలీప్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువకుడిగా, కాపు సామాజిక వర్గానికి చెందిన వాడిగా తనను తాను చెప్పుకుంటారు. ఫేస్ బుక్ వేదికగా పవన్ ఫ్యాన్ అంటూ ఓ రేంజిలో వ్యాఖ్యలు చేస్తారు. అయితే పవన్ పార్టీ నుంచి ఎదురైన అవమాన భారంతో ఇప్పుడు తనను తాను ఓ న్యాయవాదిగా, రాజకీయ విశ్లేషకుడిగా అభివర్ణించుకుంటారు. జనసేన తరఫున భీమవరంలో ఏకంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తలచిన సుంకర.. పార్టీ బహిష్కరణ వేటుకు సిద్ధమవడంతో ఆ రేసు నుంచి తప్పుకున్నారు. ఓ సందర్భంగా తనపై నమోదైన కేసులను ప్రస్తావించిన దిలీప్.. తాను పిస్టల్ తో ఓ టీవీ యాంకర్ ను బెదిరించానని చెప్పుకున్నారు. ఆ సందర్భంగా పోలీసులు తనపై కేసు నమోదు చేయడంతో పాటుగా తనపై రౌడీ షీట్ కూడా విడుదల చేశారని తెలిపారు. నాడు పోలీసుల అదుపులో తన నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పిస్టల్, బుల్లెట్లు, సెల్ ఫోన్ల ముందు నిందితుడిగా నిలబడిన దిలీప్ ఫొటోలు వైరల్ గా మారాయి. మొత్తంగా దిలీప్ తనను తాను రౌడీ షీటర్ గా ఒప్పేసుకున్నారనే చెప్పాలి.
వైసీపీకి షిఫ్ట్ అయిపోయినట్టేనా?
తాజాగా వైసీపీ పక్షం వహించిన దిలీప్.. ఓ వైపు టీడీపీని, మరోవైపు జనసేనకు నష్టం కలిగించేలా కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే దిశగా తనదైన శైలిలో సాగుతున్నారు. ఇందుకోసం *సీబీఎన్ చంద్రజ్యోతి* పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ ను ఓపెన్ చేసి.. అందులో ఏబీఎన్ రాధాకృష్ణను పోలినట్లుగా ఉండే రాకీ అనే యాంకర్ ను పెట్టుకుని అతడిపై తనదైన శైలి బూతు వ్యాఖ్యలు సంధిస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ వీడియోలన్నీ *ఓపెన్ అటాక్ విత్ ఆర్కే(రాకీ)* పేరిట విడుదల చేస్తున్నారు. ఈ వీడియోల్లో ఏబీఎన్ రాధాకృష్ణను కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిగా, కాపులను ద్వేషించే వ్యక్తిగా చూపిస్తూ కమ్మ సామాజిక వర్గంపై అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేస్తున్న వైనం కలకలం రేపుతోంది. ఇందులోని యాంకర్ రాధాకృష్ణను అనుకరిస్తూ తనదైన శైలి వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి లబ్ధి కలిగేలా.. టీడీపీకి కాపులను దూరం చేయడం, జనసేన వైపు కమ్మ సామాజిక వర్గం కన్నెత్తి చూడకపోవడం.. వెరసి ఆ రెండు సామాజిక వర్గాల ఓట్లను చీల్యే వ్యూహాలను దిలీప్ అమలు చేస్తున్నట్లుగా ఈ వీడియోలు స్పష్టం చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం వైసీపీకి చెందిన ఓ కీలక నేతతో రేటు మాట్లాడుకుని మరీ దిలీప్ ఈ పని చేస్తున్నట్లుగా ఉభయగోదావరి జిల్లాలకు చెందిన యువత బహాటంగానే చెబుతోంది. ఈ క్రమంలో దిలీప్ వ్యవహార సరళిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Must Read ;- రాంకీలో ఐటీ రైడ్స్.. వైసీపీ ఎంపీ బుక్కయ్యారా?