సభలో అడుగడుగునా అగౌరమమే ..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభమయ్యింది. సభ ప్రారంభమవ్వగానే మంత్రి కన్నాబాబు, కొడాలి నాని, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు చంద్రబాబుపై, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై బూతుల దండకాన్ని అందుకున్నారు. నోటికొచ్చిన మాట్లాడి అడుగడుగునా చంద్రబాబును అవమానించారు. ఆయన సతీమణి భువనేశ్వరిని రాజకీయాల్లోకి లాగి వక్తిగత దూషణలు చేయడం పనిగా పెట్టుకున్నారు. సభ సాంప్రదాయాలు, విజ్ఞతను మరిచి… చంద్రబాబు, ఆయన భార్యను అగౌరవంగా మాట్లాడి చిత్రహింసలకు గురిచేశారు. ప్రతిపక్షం గొంతును నొక్కుతూ .. వ్యక్తిగత దూషణలకు దిగారు. పదేపదే వ్యక్తి దూషణల దిగుతుంటే అటువంటి అవమానాలను సభలో ఉండి భరించాలా? చివరికి కుటుంబాన్ని లాగి రాజకీయం చేస్తారంటూ చంద్రబాబు కన్నీటి పర్యాంతమయ్యారు. తనకు జరిగిన అవమానాన్ని ప్రజాస్వామ్యంలోనే తెల్చుకుంటానని, తిరిగి సీఎం అయ్యాకే సభలో అడుగుపెడతానని సభను వాకౌట్ చేసి బయటకు వచ్చారు చంద్రబాబు.
బాబాయి గొడ్డలి బయటకు వస్తుందనే .. దూషణలకు దిగారు!
ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వివేక హత్యోదతం బయటకొస్తుందనే భయపడి .. సభను, టాపిక్ ను డైవర్ట్ చేశారని చంద్రబాబు వాపోయ్యారు. కుటుంబాన్ని బదనాం చేయడానికే వ్యక్తిగత దూషణలకు, బూతులకు పాల్పడుతున్నారు మీడియాకు చెప్పారు. అసెంబ్లీలో తనకు, తన భార్యకు జరిగిన పరాభాన్ని ప్రస్తావిస్తూ .. తీవ్ర అవేదనకు, కలతకు లోనైయ్యారు. నిమిషంపాటు కన్నీరుపెట్టుకుని బాధపడ్డారు. సొంత బాబాయి హత్య చేసిన కేసులో నిందుల వివరాలు బయటకు వస్తాయని, ప్రతిపక్షాన్ని నోరుమూయించడానికే ఇటువంటి దూషణలకు పాల్పడుతున్నారని చంద్రబాబు వాపోయారు. ఇక జరిగేది దర్మానికి.. ఆపధర్మానికి మధ్య యుద్దమని .. ఇక రాక్షస పాలనకు పతనం మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో తన తల్లిని దూషించారని చంద్రబాబు తెలిపారు. తరువాత రాజశేఖరెడ్డి క్షమించమని అడిగారని గుర్తుచేసుకున్నారు. ఈ రోజు వైసీపీ నాయకులు తన భార్య పరువును తీసే ప్రయత్నం చేశారు. రెండునరేళ్లు ఎన్నో అవమానాలు పడ్డా .. కేవలం ప్రజల కోసమే అన్నీ భరించా. రాక్షస రాజకీయాలు శృతిమించాయి. అందుకే సభను వాకౌట్ చేసి, నాకు జరిగిన అవమానాన్ని ప్రజలకు వివరించాలని మీడియా ముందుకు వచ్చానని చంద్రబాబు వివరించారు.











