బాలీవుడ్ యువ హీరో సుశాంత్ మృతి కేసు నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపుతో పాటు కొత్త పేర్లు కూడా వినబడుతున్నాయి. ఈ కేసులో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తిని అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎన్సీబీ విచారణలో భాగంగా ఆమె అధికారులకు అనేక విషయాలను తెలిపారు. ఈ కేసులో అనేకమంది స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వారికి అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. స్టార్ హీరోయిన్ల తమ విచారణకు అధికారుల ముందు హాజరైయ్యారు కూడా.
తాజాగా ఈ కేసులో రియా చక్రవర్తి బెయిల్ పై విడుదలైంది. ఎన్సీబీ అధికారులకు తన పాస్‌పోర్టును అప్పగించారు రియా. ప్రతి పది రోజులకు ఒకసారి దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయడానికి అంగీకరించారు ఆమె. బెయిల్ పై వచ్చిన రియా మీడియాపై న్యాయపరమైన పోరాటానికి సిద్ధమైంది. ఈ కేసులో కావాలని తన పేరుని దెబ్బతీసేలా వార్తలను ప్రసారం చేసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలను తీసుకోవడానికి రియా చక్రవర్తి సిద్ధమైనట్లు ఆమె లాయర్ సతీశ్ మనీషిండే తెలిపారు.
ఆమె పేరు కావాలనే పదే పదే మీడియాలో వాడారని, తన పరువు దెబ్బతీయడానికే ఇదంతా జరిగిందని ఆమె తరుపు లాయర్ తెలిపారు. ఈ వార్తపై కొందరు మీడియా ప్రముఖులు స్పందించారు. రియా చేస్తున్న న్యాయపోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. మరోపక్క సుశాంత్ అభిమానులు మాత్రం రియాపై మండిపడుతున్నారు. ఆమె వల్లే తమ అభిమాన హీరో చనిపోయాడని మేము నమ్ముతున్నాం అని తెలిపారు. కావాలనే ఈ కేసును దారి మళ్లించడానికి రియా తరుపున కొందరు ప్రయతిస్తున్నారని వారు తెలిపారు. సుశాంత్ మరణానికి ఎవరు కారణం అని పోలీసులు తెలుసుకొని, నిందితులను కఠినంగా శిక్షించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.











