విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అప్పటి నుంచి టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. గోపాలా గోపాలా, వెంకీమామ, ఎఫ్ 2.. ఇలా మల్టీస్టారర్ మూవీస్ వచ్చాయి. ప్రజెంట్ చిరు, చరణ్ ల ఆచార్య, ఎన్టీఆర్, చరణ్‌ల ఆర్ఆర్ఆర్, వెంకీ, వరుణ్ ల ఎఫ్ 3, నాగ్, నాగచైతన్యల బంగార్రాజు.. ఇలా క్రేజీ మల్టీస్టారర్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాలయ్య, మహేష్ కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ ప్లాన్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.
బాలకృష్ణ కోసం కొరటాల ఒక పవర్‌ఫుల్ కథ సిద్ధం చేశారట. ఇందులో ఇద్దరు కథానాయకులకు అవకాశం ఉండటంతో మరో హీరో ఎవరా? అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మహేష్ బాబు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే… కొరటాల ఇప్పటికే మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను అనే రెండు సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దీంతో కొరటాల బాలయ్యతో చేసే సినిమాలో నటించేందుకు మహేష్ ఓకే చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఒకవేళ మహేష్ కాదంటే, మెగా క్యాంపు నుంచి కథానాయకుడిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే.. దీని పై క్లారిటీ రావాల్సి ఉంది. బాలయ్యకు ఉన్న షెడ్యూల్ ప్రకారం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్ మలినేనితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ పైకి వెళుతుంది. ఆ తర్వాత సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. మరో వైపు కొరటాల ఆచార్యను పూర్తి చేశారు. ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది. ఆతర్వాతే బాలయ్యతో మూవీ సెట్స్ పైకి వస్తుంది. దీని ప్రకారం.. ఈ క్రేజీ మల్టీస్టారర్ సెట్స్ పైకి రావడానికి టైమ్ పట్టచ్చు. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.











