విరసం నేతలపై ప్రభుత్వం ఉక్కుపాదం..!
విరసం నేతల నోర్లును కుట్టేయ్యాలని చూస్తే.. సమాధానాలు వేరే వైపు నుంచి వస్తాయని జగన్ రెడ్డి ప్రభుత్వానానికి తెలియదు కాబోలు! అందుకే వారిపై విరుచుకుపడుతున్నారు. అనేక ఉద్యమాల ద్వారా హక్కులను కాలరాస్తున్న దుష్టశక్తులపై తన కలాన్ని ఎక్కుపెట్టి.. జాతిని సంఘటితం చేస్తున్న గొప్ప అభ్యదయ భావాలున్న రచయితలు విరసం నేతలు! అటువంటి ‘విప్లవ రచయితల సంఘం’ పై ప్రస్తుతం ఏపి ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. వారిపై ఉక్కుపాదం మోపి.. నోటిని కుట్టి, చేతులను కట్టెయ్యాలని చూస్తోంది. ఈ చర్యను ఏ ఒక్కరూ హర్షించరు! ఏపీలో జరుగుతున్న దోపిడీ, నియంతృత్వ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని విసరం నేత ప్రకటించారు. నెల్లూరు జిల్లా కోవూరు వేదికగా రెండోరోజు సోమవారం విరసం సభలో రచయితలు జగన్ చర్యలను ఎండగట్టారు. సంస్కృతి, మార్క్సిజంపై చర్చించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన రచయితలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చైతన్యం దిశగా నడిపే రచయితల చేతులు కట్టేస్తారా?
జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా.. కటకటాలపాలే అన్న సంస్కృతి పౌర హక్కులను కాలరాస్తోంది. ప్రశ్నించిన ప్రతిపక్షం, మీడియా, రచయితలపై అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేస్తున్నారు. కవులు, రచయితలు, మీడియా యొక్క భావ ప్రకటన స్వేచ్ఛకు గొడ్డలి పెట్టుగా మారిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు దెగ్గరపడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, రాజ్యాంగబద్ధంగా ముఖ్య పదవుల్లో కొనసాగే వ్యక్తులపై ఆపార్టీ నేత పాకీ (పంచ్) ప్రభాకర్ రెడ్డి ఇష్టారీతిన పరుషపాదజాలంతో బూతుల తిట్టిన జగన్ రెడ్డికి అవి వినిపించవు. కానీ పార్లమెంట్ వార్డ్స్ తో విమర్శలు చేసినా, వార్తలు రాసిన జీర్ణించుకోలేని మనోవైకల్యం ఏమిటో అర్థంకావడం లేదు! భావప్రకటన స్వేచ్ఛ రాష్ట్రంలో ఏ ఒక్కరి సొత్తుకాదు.. అది రాజ్యాంగ కల్పించిన అందరి హక్కు అన్నది జగన్ రెడ్డి గుర్తించాలని విరసం నేతలు వాపోతున్నారు. ప్రజా చైతన్యానికి పాటుపడే రయితలను అరెస్ట్ చేయడం దారుణమని, తక్షణమే విరసం నేతలను విడుదల చేసి, తప్పు తెలుసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా మేధావులు నుంచి పెద్దఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి.










