ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాల పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ క్రేజీ మూవీ నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు.
అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో ప్రకటించారు కానీ.. విడుదల వాయిదా పడుతుందంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆచార్య విడుదల మళ్లీ వాయిదా పడిందా..? ప్రచారంలో ఉన్న వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది ఆసక్తిగా మారింది. దీంతో ఈ వార్తలను నిర్మాతలు ఖండించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ఆచార్య సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు.
ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యింది. అనౌన్స్ మెంట్ చేసిన రోజు నుంచే సినిమా విడుదల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు మెగా ఫ్యాన్స్, అటు ప్రేక్షకులు సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అందరి అంచనాలకు తగినట్లే ఆచార్య సినిమా ఉంటుంది అన్నారు.











