NO NOMINATION EXTENSIONస్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగించాలని సుప్రీం కోర్టుకి వెళ్లిన వైసీపీకి షాక్ తగిలింది. నామినేషన్ల గుడువు పొడిగించడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నామినేషన్లు అడ్డుకొన్నారని ఫిర్యాదులు అందిన చోట.. వాటిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి కంప్లయింట్లు అందిన ప్రాంతాలకే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
సుప్రీం కోర్టు ఆదేశాలను వక్రీకరిస్తూ వైసీపీ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. 19 ప్రాంతాల్లో నామినేషన్ల గడువు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని.. ఈ తీర్పుతో ఎస్ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందని ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. నామినేషన్లపై హైకోర్టులో, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన వైసీపీ నాయకులు.. ఎస్ఈసీకి గానీ, పోలీసులకు గానీ ఫిర్యాదు చేయలేదు. ఇప్పటికే కంప్లయింట్ చేసిన వారి కేసులను మాత్రమే పరిశీలించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అంటే బ్లూ మీడియాలో టాంటాం చేస్తున్నట్లు.. 19 చోట్ల నామినేషన్ల గడువు పొడిగించారనే వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని అర్ధమవుతోంది.
ఈ పిటిషన్ విచారణ సమయంలో.. వైసీపీ ఎంపీలు, ఆ పార్టీ నాయకులే అరాచకాలు చేశారని స్టేట్ ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాదులు సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టుకొని.. తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలతో పాటు పోలీసులపైనా దాడులకు తెగబడిన విషయాన్ని వివరించారు. ఎంపీ మిధున్‌రెడ్డి కాన్వాయ్‌లోని కారుతో టీడీపీ కార్యకర్తలను తొక్కించిన వీడియోని కోర్టుకి చూపించారు. వాళ్లే ప్రత్యర్ధులపై దాడులు చేసి.. ఆ దౌర్జన్యకాండ కారణంగా జరిగిన గొడవలను చూపించి నామినేషన్ల గడువు పెంచాలని, ఎన్నికలను ఆపాలని కోర్టుల్లో కేసులు వేసి రాజకీయ కుట్రకు తెరలేపిన విషయాన్ని ఆధారాలతో సహా సుప్రీం కోర్టు ముందు ఉంచారు.
పులివెందుల, పుంగనూరు, రాయచోటి వంటి వైసీపీ ముఖ్య నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో ఓటమి భయంతోనే అల్లర్లకు దిగినట్లు తెలుస్తోంది. కోర్టుల ద్వారా ఎన్నికలు అడ్డుకోవడం.. కుదరకపోతే స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం లేదనే సాకుతో పోటీ నుంచి తప్పుకోవడానికే.. గొడవలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. సుప్రీం కోర్టు వైసీపీ అనుకూలంగా ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది. వైసీపీ అనుకూల మీడియాలో మాత్రం పూర్తిగా రివర్స్ స్టోరీలు రుద్దుతున్నారు. ఎస్ఈసీ మీద బురద జల్లడానికే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించకపోతే కోర్టు ధిక్కరణ కేసు వేయొచ్చు. కానీ ఫేక్ ప్రచారాలతో సుప్రీం కోర్టుకి వెళ్తే మొట్టికాయలు పడతాయి. నామినేషన్ల విషయంలో మళ్లీ కోర్టుకి వెళ్లకుండా సొంత మీడియాలో విమర్శలకే పరిమితం అయితే.. ఇదంతా తప్పుడు ప్రచారమే అని తేలిపోతుంది.











