పేదల మెడకు ఊరితాడు …!
ఓటిఎస్ పేరుతో పేదల మెడకు ఉరితాడును బిగిస్తోంది జగన్ సర్కార్..! ఆదాయ వనరులను పెంచి, పేదలకు సంక్షేమాన్ని అందించాల్సిన ప్రభుత్వం .. ఆదాయాన్ని సర్వత్ర కూల్చి, సంక్షేమాన్ని సంక్షోభంలో నడిపిస్తున్న ఘనత జగన్ కే దక్కుతోంది. గత ముప్పై ఏళ్ల క్రితం కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు గృహ హక్కులు కల్పిస్తామని, ప్రజల ముందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. బిలో ప్రాపర్టీ లైన్ ( దారిద్య్ర రేఖకు దిగువన ) ఉన్న పేదలకు ప్రభుత్వం రుణాలను మంజూరు చేసి ఇళ్లు నిర్మిస్తే .. ఇప్పుడు జగన్ రెడ్డి ఆ రుణాలను మాఫి చేసి వాటిని మీ పేరు పై రిజిస్ట్రేషన్ చేస్తాం, అప్పుడు మీకు మీ గృహాలపై పూర్తిగా హక్కులు ఉంటాయి, ఆ తరువాత బ్యాంకు ఆ దస్త్రాలను తాకట్టుపెట్టుకుని రుణాలు కూడా పొందవచ్చునన్నది ఏపీ ప్రభుత్వ ప్రచారం. కానీ ప్రజలు ఈ పథకం అమలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఒత్తిడి చేయడం లేదంటూ ప్రభుత్వం చెబుతూనే .. జిల్లా కలెక్టర్లు నుంచి కిందిస్థాయి సచివాలయం సిబ్బంది వరకు ముక్కుపిండి ప్రజల వద్ద నుంచి ఓటీఎస్ ను పూర్తి స్థాయిలో అమలుపర్చాలని హుకూం జారీ చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు అని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించే దిశగా ఓటీఎస్ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నామని చెబుతూనే .. వేలకోట్లను అర్జించాలని ప్రణాళికలు రచిస్తున్నారు.
టిడ్కో ఇళ్ల సంగతేంటి? రూ. 4 వేల కోట్ల వసూళ్లే లక్ష్యమా ..!
ఏపీలో తెలుగుదేశం పార్టీ హయంలో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు 7 లక్షల గృహాలను మంజురు చేశారు. ఇందులో 4 లక్షల 45 వేల ఇళ్లును ఏడాది కాలం లోపే నిర్మించి, లబ్ధిదారులతో గృహప్రవేశాలు కూడా చేయించింది ఆనాటి టీడీపీ ప్రభుత్వం. మరో 3 లక్షల పైచిలుకు గృహాలు దాదాపు 80 శాతం పూర్తయ్యాయి. వీటన్నింటిని జగన్ రెడ్డి కుట్రపూరితంగా నిలిపివేసి, లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందుకుల గురిచేస్తున్నారు. లబ్ధిదారుడుకు ఇవ్వాల్సిన టిడ్కో ఇళ్లు గడిచిన రెండునరేళ్లుగా నిలిపివేసి పైశాచి ఆనందాన్ని పొందుతోంది అధికార పార్టీ. పేదలకు అందించాల్సిన టిడ్కో ఇళ్లను ఎప్పుడిస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఓటిఎస్ పై రూ. 4 వేల కోట్లను సముపార్జించాలనే లక్ష్యంగా జగన్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ నెల 9 నుంచి ప్రారంభమై ఓటీఎస్, నిన్నటి వరకు (సోమవారం, 20) వరకు స్కీమ్ లో నగదు చెల్లించిన లబ్ధిదారుడికి రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేస్తారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా, తణుకులో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.










