టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు సోల్మాన్ దర్శకత్వం వహించారు. యాక్షన్ మూవీగా రూపొందిన ఈ మూవీ ఇటీవల కులుమనాలిలో షూటింగ్ జరుపుకుంది. దీంతో ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. అయితే.. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడు అనేది చిత్రయూనిట్ ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కానున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఓటీటీలో కాదు థియేటర్లోనే రిలీజ్ చేస్తారని ప్రచారం జరిగింది.
తాజా వార్త ఏంటంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ దక్కించుకున్నట్టు సమాచారం. 27 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ దక్కించుకుందట. ఆల్రెడీ ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ను అమ్మేయడం జరిగింది. దీంతో ఈ సినిమాకి మరో 10 కోట్ల మేరకు లాభం వచ్చిందని తెలిసింది. ఈ నెలాఖరున నెట్ ఫ్లిక్స్ డైరెక్ట్ గా ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ మూవీని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.
డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న బిగ్ తెలుగు మూవీ ఇదే కావడం విశేషం. త్వరలోనే ఈ విషయాన్ని అఫిషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. ఇందులో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మ పాత్ర పోషించారు. బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా ఇందులో నటించింది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను పెంచిందని చెప్పచ్చు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. మరి.. నాగార్జున ‘వైల్డ్ డాగ్’ మూవీతో ఏ స్ధాయి విజయాన్ని సాధిస్తారో చూడాలి.