తెరపై అంజలిని చూడగానే ఉరకలేసే గోదారి గుర్తొస్తుంది .. పడుచుదనంతో పరుగులు తీసే కృష్ణమ్మ కళ్లముందు కదలాడుతుంది. ముద్దబంతి వంటి అంజలికి ముద్దపప్పులా .. మూడీగా ఉండటం అస్సలు తెలియదు. అంజలి ఎక్కడ ఉంటే అక్కడ సందడే .. పాత్ర ఏదైనా పసందైన పండగే. అలాంటి అంజలి తెలుగు తెరకి సంబంధించి పాటల్లో మినహా గ్లామర్ డోస్ పెంచేసిన సందర్భాలు పెద్దగా కనిపించవు. ఎంత రెచ్చిపోయినా పట్టుమని ఓ లిప్ లాక్ కుర్రాళ్లకి కొసరు వేసిందీ లేదు. అలాంటి అంజలి హాట్ లుక్స్ తో కనిపించడం .. ఓ లిప్ లాక్ పేల్చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అంజలికి కొంతకాలంగా ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను సరైన హిట్ లేదు. తెలుగులో ‘డిక్టేటర్‘ తరువాత ఆమె ఆ స్థాయి సినిమా చేయలేదు. మధ్యలో ఐటమ్ సాంగ్స్ లో మెరిసింది .. అతిథి పాత్రల్లో విరిసింది అంతే. ఇటీవల వచ్చిన ‘నిశ్శబ్దం‘ సినిమాలో అంజలికి మంచి పాత్రే లభించినప్పటికీ, అది హిట్ కాకపోవడంతో దాని గురించి ఎవరూ మాట్లాడుకోలేదు. ఇక సెట్స్ పై ఒకటి రెండు తెలుగు .. తమిళ సినిమాలు ఉన్నాయి. కానీ అవి ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతాయో తెలియదు. అందుకే హాట్ గా కనిపించి .. హాట్ టాపిక్ గా మారాలనే ఒక సాహసవంతమైన నిర్ణయాన్ని అంజలి తీసుకున్నట్టుగా అనిపిస్తోంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ పై కూడా పట్టు బిగించాలనుకున్న అంజలి, తమిళంలో ‘పావ కథైగళ్’ అనే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. అంజలి చేసిన ఎపిసోడ్ నిన్న ‘నెట్ ఫ్లిక్స్’లో విడుదలైంది. ఈ ఎపిసోడ్ లో ‘జ్యోతిలక్ష్మీ’ .. ‘ఆదిలక్ష్మీ’ అనే రెండు పాత్రలను అంజలి పోషించింది. బెడ్ పై బ్లాక్ ‘బ్రా’ తో ఆమె కనిపించింది. అంతేకాదు సన్నివేశానికి తగినట్టుగా బాలీవుడ్ నటి ‘కల్కి’కి గాఢంగా ఒక లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. ఇంతవరకూ తెరపై హీరోలకు లిప్ లాక్ ఇస్తూ కనిపించని అంజలి, తన సహనటికి అధర చుంబనం చేయడం చర్చనీయాంశమైంది.
ఈ లిప్ లాక్ ఏదో .. సినిమాల్లో హీరోకి ఇచ్చేసి ఉంటే కుర్రాళ్ల గుండెలన్నీ కుంపట్లై పోయేవే. కానీ అంజలి మరో లేడీకి ఇవ్వడమే యువకుల్స్ కి నిరాశను కలిగిస్తోంది. అంజలి ఇంత హాట్ గా చూపించిన ఘనత దర్శకుడు విఘ్నేశ్ శివన్ కే దక్కింది. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కథాకథనాలు బలంగా .. ఆసక్తికరంగా లేకపోవడం వలన, లెస్బియన్ గా ఇంతకష్టపడి అంజలి చేసిన లిప్ లాక్ వేస్ట్ అయిందనే అంటున్నారు. ఒక పొద్దు వేస్ట్ అయినా ఫరవాలేదు .. ఒక ముద్దు వేస్ట్ అయితే కుర్రాళ్లు ఎంత బాధపడతారో కుర్రాళ్లకు మాత్రమే తెలుస్తుంది మరి!
Must Read ;- విక్రమ్ భట్ ‘అనామిక’ వెబ్ సిరీస్ లో సన్నీలియోన్