ఏపీ మంత్రి అంబటి రాంబాబు పై టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే అంటూ అంబటి రాంబాబు పేరును ట్యాగ్ చేస్తూ ట్విటర్ వేదికాగా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు అయ్యన్న పాత్రుడు. కాగా ఇదే విషయంపై ఆయన పలు వివరాలను తన ట్వీట్ లో తెలిపారు.
అందులో.. ”సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సప్ లో మెసేజ్ చేసింది యూట్యూబ్ ఛానల్ యాంకర్… ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ రిప్లై ఇచ్చాడు కాంబాబు ” అని అయ్యన్న పేర్కొన్నారు. అక్కడితో ఆ వ్యవహారం ఆగలేదని… త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి తెలుస్తాయని ఆయన తెలిపారు.
అదేసమయంలో, మహిళా జర్నలిస్ట్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన కాంబాబు బూతు పురాణం సీఎంతో సహా సంబంధిత వ్యవస్థలకు చేరిందని.. ఇక త్వరలో కాంబాబు బర్తరఫ్ అవ్వడం ఖాయం” అని అయ్యన్న పాత్రుడు తన ట్వీట్ లో వెల్లడించారు. కాగా, అంబటి పై అయ్యన్న చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే గడప గడప కి అంటూ వైసీపీ పిలుపునిచ్చింది, అక్కడ కాంబబు గారు పడక పడకకి అంటే కష్టమే అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.