టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా, యంగ్ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్కార్ వారి పాట. ఈ మూవీ పై మహేష్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.సినిమా ఫస్ట్ లుక్ మొదలు ట్రైలర్ వరకు ప్రతీదీ ఒక సెన్సేషన్ కావడంతో ఎప్పుడేదేపపుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా, భారీ అంచనాలతో విడుదల అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ టాక్ ని కైవసం చేసుకోలేకపోయింది.
కరెంట్ అఫ్ఫైర్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మెయిన్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది.ఒక సినిమా హిట్ కావాలంటే డానికి బలమైన కధ కావాలి. దానితో పాటు ఇతర అంశాలను బాలన్స్ చేస్తేనె మంచి రిపోర్ట్ వస్తుంది. నిజానికి మహేష్ కొంతకాలంగా చేస్తున్న చిత్రాలు మెసేజ్ ఒరిఎంటెడ్ గా ఉంటున్నాయి. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి.. ఈ చిత్రాలన్నీ అలాంటి కథలే. దర్శకులు ఈ సినిమాలలో కమర్షియల్ అంశాల్ని, హీరోయిజాన్నీ తెలివిగా బాలెన్స్ చేయడం వల్ల అవి సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈసారి కొంత డిఫరెంట్ గా బ్యాంకులు , వాటిని దోచుకుంటున్న పెద్ద మనుసులు అనే అంశాన్ని ఎంచుకున్నాడు.
వాస్తవానికి ఇది బలమైన కరెంట్ టాపిక్ అయినప్పటికీ మహేష్ బాబు క్రేజ్ కి తగ్గట్టు మలవడంలో దర్శకుడు పరశురాం అంతగా సక్సెస్ కాలేకపోయాడు. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ చూపించడంలో , సందేశానికీ, కమర్షియాలిటీకి లింకు ఎలా కుదిరింది అనే లాజిక్ ని కూడా డైరెక్టర్ మిస్ అయ్యాడు. మహేష్ స్టార్ డమ్ మీదనే బేస్ అయ్యి.. నాలుగు ఫైట్ లు, ఆర్ పాటలు, కాస్త రొమాన్స్ , ఇంకాస్త కామెడీ ఇలా అన్నీ కొలతలు వేసుకుని తీసినట్లే కనిపిస్తుంది.
నిజానికి సినిమాలో కథకీ మహేష్ క్యారెక్టరైజేషన్‌కీ ఏమాత్రం పొంతన కుదర్లేదు.. మహేష్ బాబు చిన్నతనం ఎపిసోడ్ తో కథ మొదలవుతుంది.మహేష్ తల్లిదండ్రులు పదిహేను వేలు అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటారు. అప్పటి నుంచీ హీరో డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు. పెద్ద వాడయ్యాకా అమెరికా వెళ్లి మరీ అప్పులిస్తుంటాడు. ఈ క్రమంలో పది వేల డాలర్ల అప్పు వసూలు చేయడం కోసం అమెరికా నుంచి విశాఖపట్నం వరకూ వచ్చేస్తాడు.
మహేష్ ఇంట్రడక్షన్ ఫైటు, ఆ వెంటనే పెన్నీ పాట.. ఇవన్నీ ఫ్యాన్స్‌ని అలరించే అంశాలే. కీర్తి సురేష్ తో లవ్ ట్రాక్ గురించి మహేష్ తో సహా.. అంతా గొప్పగా చెప్పారు.కానీఅనుకున్నంత గొప్పగా లేకపోయినా..ఇద్దరి మధ్య నడిచే లవ్ ట్రాకే ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ పార్ట్ అని చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్ లోనే మహేష్ లో ఈజ్‌నీ, `బాయ్.. థింగ్`నీ చూసే అవకాశం దక్కింది. లవ్ ట్రాక్ అయిపోతూనే కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. హీరో, బాకీ వసూలు కోసం విశాఖపట్నం రావడం, ఇక్కడ సముద్ర ఖనికి వార్నింగ్ ఇవ్వడం.. బీచ్ ఫైట్ ఇవన్నీ మళ్లీ ఫక్తు కమర్షియల్ మీటర్లో సాగాయి. పది వేల కోట్లు.. అనే చిన్న ట్విస్ట్ తో ఇంట్రవెల్ కార్డ్ పడుతుంది.
సెకండ్ హాఫ్ లో ఆ పదివేల కోట్ల కథేమిటి? పది వేల కోట్లు ముక్కు పిండి వసూలు చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు అంత ఇన్నోవేటివ్ గా ఏమీ ఉండవు.హీరో ఒక్కడే లారీ వేసుకెళ్లి వందల మందిని చెదరగొట్టడం.. సముద్రఖనికి నోటీసులు ఇవ్వడం కాస్త అతిగా కనిపిస్తుంది..ఇక్కడ కథకు తగ్గట్టు హీరో తెలివి తేటలు ఏమిటి అనేది చూపించలేకపోయాడు దర్శకుడు పరశురాం. తన తల్లిదండ్రులు లాగా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఏ కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకోకూడదు అనే ఆలోచనలో హీరో పోరాటం చేస్తున్నాడన్న విషయం ప్రేక్షకుడికి అర్థమవుతూనే ఉన్నా ఏ ఎమోషన్ కలగదు. అంటే కథలో ఎమోషన్ క్యారీ చేయడంలో కూడా డైరెక్టర్ ఫైల్ అయ్యాడు.మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి నెగిటీవ్ గా కనిపించే హీరోయిన్ పాత్ర.. చివర్లో పాజిటీవ్ గా టర్న్ తీసుకోవడం ఏమిటో అర్ధం కాకుండా జరిగిపోతుంది. కథ సాగుతుంటే ఇదంతా కేవలం `మ.. మ మహేషా` అనే మాస్ పాట కోసమే అని అర్థమవుతూనే ఉంటుంది.ఇక క్లైమాక్స్ సమయానికి విలన్ పాత్రలో వచ్చే మార్పు కూడా అంతగా ఏమీ ఎక్కదు.
టోటల్ గా చూస్తే సర్కార్ వారి పాట సినిమా మొత్తం మహేష్ పెర్‌ఫార్మెన్స్ తో లేస్తూ.. మధ్యలో కథలేమితో పడుతూ… అలా.. అలా సాగిపోయింది. ఈ మూవీతో మహేష్ మరోసారి వన్ మాన్ షో చేశాడు. కొత్త లుక్, కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. డాన్సుల్లోనూ ఈసారి మహేష్ మెరిశాడని చెప్పుకోవచ్చు.చాలా రోజుల తరవాత మహేష్ ఈ చిత్రంలో పేజీల కొద్దీ డైలాగులు చెప్పాడు. తన మేనరిజంతో అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇక డైరెక్టర్ పరశురాం కూడా ఓ కమర్షియల్ హీరోతో.. ఓ భారీ బడ్జెట్ సినిమా ద్వారా బలమైన పాయింట్ చెప్పాలనుకున్నప్పటికీ.. చిక్కల్లా ఎక్కడంటే.. సినిమాలో పాటలు, ఫైట్లు, హీరోయిన్ తో రొమాన్స్ లాంటి కమర్షియల్ అంశాల కలబోతే సరిపోలేదు. పార్టులు పార్టులుగా చూసినప్పుడు సీన్లు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ.. మొత్తం చూస్తే దర్శకుడు పరశురాం రాసుకున్న కథ తేలిపోయింది అని స్పష్టమవుతుంది.
మొత్తంగా చూస్తే సర్కారు వారి పాట మహేష్ అభిమానులకు ఒక ఫీస్ట్ గానూ, మిగిలిన వాళ్లకు ఈ సినిమా `జస్ట్… ఓకే` గానే అనిపిస్తుంది.