‘ఖైదీ, తంబీ ’ లాంటి సినిమాలతో కోలీవుడ్ జనాన్నే కాకుండా.. టాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా బాగా ఆకట్టుకున్నాడు తమిళ హీరో కార్తీ. తదుపరిగా ‘సుల్తాన్’ అనే థ్రిల్లర్ మూవీతో రాబోతున్నాడు. శివకార్తికేయన్ తో రెమో సినిమా తెరకెక్కించిన తమిళ, తెలుగులో సైతం విజయం అందుకున్న భాగ్యరాజ్ కణ్ణన్ ఈ సినిమాకి దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై యస్.ఆర్. ప్రభు నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజుతో పూర్తయింది. ఈ విషయాన్ని నిర్మాత ప్రభు .. అధికారికంగా ప్రటించారు. తన క్రూతో కలిసి ఉన్న ఫోటోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
లాక్ డౌన్ లో దొరికిన సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని .. ఈ సినిమా ఎడిటింగ్ ని, తదితర కార్యక్రమాల్ని పూర్తి చేసింది చిత్ర బృందం. రష్మికా మందణ్ణ కథానాయికగా కోలీవుడ్ లో ఈ సినిమాతోనే అడుగుపెడుతోంది. కార్తీ, రష్మికా ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయినట్టు చెబుతున్నారు. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని ఓ మంచి డేట్ చూసి సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ‘సుల్తాన్’ తో కార్తీ ఏ రేంజ్ హిట్టు కొడతాడో చూడాలి.
#Sulthan has been a wonderful experience. With such a huge crew, we never felt the pressure anywhere all along. Thanks to the whole team. This is going to be one of the biggest family entertainer from @DreamWarriorpic Looking forward to present on a festive date soon! #JaiSulthan pic.twitter.com/XvqOQzlLhQ
— SR Prabu (@prabhu_sr) October 8, 2020











