వైసీపీ నుండి మరో వికెట్ డౌన్ అయిందా..? అసెంబ్లీ సాక్షిగా వెల్లడయిందా..? ఏకంగా ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికే ఆ ఎమ్‌ఎల్‌ఏ షాక్ ఇచ్చాడా.??? తాను పార్టీ మారుతున్నానని మొహం మీదే చెప్పేశాడా..?. అసెంబ్లీ సాక్షిగా బయటపడిన ఆసక్తికర సన్నివేశం.. ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది..
రాక రాక మూడు నెలల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టాడు వైసీపీ ఫ్లోర్ లీడర్, పులివెందుల ఎమ్‌ఎల్‌ఏ జగన్.. ఆయన అడుగుపెట్టిన ముహూర్తం బాగాలేదో, ఆయన చేస్తున్న రాజకీయ నిర్వాకం నచ్చలేదో కానీ, ఆ పార్టీకి చెందిన ఎమ్‌ఎల్‌ఏ తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ కండువా లేకుండా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.. ఈ అంశంపై ఆయన ఎమ్‌ఎల్‌ఏ చంద్రశేఖర్‌ని నిలదీశాడు. వైసీపీ సభ్యులందరూ పార్టీ కండువాలు వేసుకుని వస్తే నువ్వెందుకు కండువా వేసుకోలేదని ప్రశ్నించాడు జగన్. దీనికి ఎమ్‌ఎల్‌ఏ వెంటనే సమాధానం ఇచ్చారు.. కండువా మర్చిపోయానని తెలిపారు.. దీనికి షాక్ అయిన జగన్.. వెంటనే కండువా మర్చిపోయావా…మార్చడానికి సిద్ధంగా ఉన్నావా అని తిరిగి ప్రశ్నించాడు.. జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అక్కడి నుండి తుర్రుమన్నాడు ఎమ్‌ఎల్ చంద్రశేఖర్.
తాటిపర్తి చంద్రశేఖర్.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన ఎమ్‌ఎల్‌ఏ.. గత ఎన్నికలలో చంద్రబాబు వేవ్‌ని, సైకిల్ తుఫాన్‌ని తట్టుకొని గెలిచిన అతి కొద్ది మంది ఎమ్‌ఎల్‌ఏలలో ఈయన ఒకరు.. 2019లో ఈ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయం సాధించారు.. సామాజిక ఈక్వేషన్ లెక్కలతోపాటు మరికొన్ని ఈక్వేషన్లలో జగన్… ఆదిమూలపు సురేష్‌ని ఎర్రగొండ పాలెం నియోజకవర్గం స్థానంలో కొండేపి నుండి పోటీ చేయించారు.. కొండేపిలో ఓడిపోయాడు ఆదిమూలపు సురేష్… అయితే, ఎర్రగొండ పాలెం అసెంబ్లీ సెగ్మెంట్ నుండి తాటిపర్తి చంద్రశేఖర్ గెలుపొందారు.. అసెంబ్లీలో అడుగుపెట్టాడు..
ఇటీవల మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్.. పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది.. ఆయన టీడీపీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని కథనాలు వచ్చాయి.. ఆదిమూలపు సురేష్.. దగ్గరుండి తాటిపర్తితో ఈ గేమ్ ఆడించారా..?? లేక, టీడీపీతో టచ్‌లోకి వచ్చిన తాటిపర్తి స్వయంగా కండువా వేసుకోవడం మరిచిపోయారా…?? అనేది రాజకీయ వర్గాలలో దుమారం రేపుతోంది.. అయితే, కండువా మార్చడం కోసమే ఆయన కండువా వేసుకురాలేదని వైసీపీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారట.. మరి, తాటిపర్తి ఎలాంటి బ్రేకింగ్ ఇస్తారో చూడాలి..











