సూపర్ స్టార్ రజనీకాంత్ కు, విలక్షణ నటుడు మోహన్ బాబు కు మధ్య ఎప్పటినుంచో మంచి రిలేషన్స్ ఉన్నాయి. వీరిద్దరూ కలిసి అప్పట్లో ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించారు. రజనీ కాంత్ తమిళంలో ‘పదినారు వయదినిలే’ సినిమాలో చేసిన విలన్ పాత్రను తెలుగు వెర్షన్ లో మోహన్ బాబునే నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్యా మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. ఆ రిలేషన్ తోనే పెదరాయుడులోని ప్రత్యేక పాత్రను రజినీకాంత్ పోషించి మెప్పించారు. దాని వల్లే సినిమా సూపర్ హిట్టయిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
రజనీకాంత్ ఎప్పుడు హైద్రాబాద్ వచ్చినా.. మోహన్ బాబును కలవకుండా వెళ్ళరు. తిరుపతిలో మోహన్ బాబు నడుపుతోన్న శ్రీ విద్యానికేతన్ స్కూల్లో రజనీకాంత్ కోసం ప్రత్యేకించి ఒక గెస్ట్ హౌస్ లాంటిదే కట్టించారు మోహన్ బాబు. ఈ నేపథ్యంలో ఇటీవల రజనీకాంత్ ‘అన్నాత్తా’ షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్ వచ్చినప్పుడు .. ఆయన మోహన్ బాబును కలిసి.. కొంత టైమ్ ఆయనతో స్పేర్ చేసినట్టు తెలుస్తోంది. ఆ సందర్భంగా మంచు విష్ణు .. ఆ ఇద్దరి మధ్యా ఒక ప్రత్యేకమైన ఫోటో షూట్ లాంటిది చేశాడు. వైట్ అండ్ వైట్ డ్రెసెస్ లో మిత్రులిద్దరూ మెరిశారు.
వీరి ఫోటోల్ని మంచు విష్ణు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేస్తూ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చేశాడు. వారద్దరితోనూ తానూ ఒక పక్క నిలబడి ఫోటోకి చక్కటి పోజిచ్చాడు కూడా. ఈ ఫోటోను చూస్తుంటే.. త్వరలోనే రజనీ, మోహన్ బాబు లిద్దరూ దళపతిలాంటి గ్యాంగ్ స్టర్ మూవీలో ఏమైనా నటించబోతున్నారా అనే సందేహం కలగకమానదు. సినిమా కాకపోయినా.. ఇద్దరూ హీరోలుగా.. ఒక వెబ్ సిరీస్ వస్తే కూడా ఆసక్తికరంగా ఉంటుంది కదూ… మరి ఆ దిశగా మంచు విష్ణు ఏమైనా ప్లాన్ చేస్తున్నాడేమో చూడాలి.
Must Read ;- సీఎం సహాయనిధికి రజినీ కుమార్తె సౌందర్య సాయం
The OGs. Original Gangsters! @rajinikanth @themohanbabu and then goofy Vishnu Manchu pic.twitter.com/2eUoaKDo5Q
— Vishnu Manchu (@iVishnuManchu) May 21, 2021