ఎంపీ రఘురామరాజు కేసు అనేక మలుపులు తీసుకుంటోంది.ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. రమేష్ ఆసుపత్రిలో రఘురామరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈ నెల15న సీఐడీ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం హైకోర్టులో ఇవాళ లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది.ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు అనుమతించింది.ఈ పిటీషన్ ఇవాళ మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశం ఉంది.రమేష్ ఆసుపత్రిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని,రమేష్ ఆసుపత్రిలో రఘురామను జాయిన్ చేయిస్తే టీడీపీ కార్యాలయంలో జాయిన్ చేసినట్టేనని ఏఏజీ నిన్న హైకోర్టులో వాదించిన సంగతి తెలిసిందే.
భద్రతపై కూడా..
రఘురామరాజుకు రమేష్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని,అతను కోలుకునే వరకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందవచ్చని సీఐడీ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం,ఎంపీకి కల్పించిన వై కేటగిరీ భద్రత విషయంలోనూ పిటీషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు.అతనికి కేంద్రం కల్పించిన వై కేటగిరీ భద్రత కొనసాగించాలని సీఐడీ కోర్టు తీర్పు చెప్పింది.దీనిపై కూడా ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటీషన్లో పేర్కొంది.
Must Read ;- ఈ రోజు రాత్రి నా భర్తను చంపేందుకు కుట్ర : రఘురామరాజు భార్య సంచలన కామెంట్స్











