భాగ్యనగరానికి మరో ప్రతిష్ఠాత్మకమైన గుర్తింపు చేరింది. తెలంగాణ మొత్తం ఆకుపచ్చని చెట్లతో విలసిల్లాలని ‘హరితహారం’ పేరుతో చెట్లను నాటుతూ పచ్చదనాన్ని పెంచుతూ నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వ కష్టానికి గుర్తంపు లభించింది. ఈ గుర్తింపును అందించిన వారు ఎవరో కాదు.. ఆర్బోర్‌డే (Arborday) ఫౌండేషన్. ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్‌తో కలసి ఆర్బోర్‌డే పని చేస్తుంది.
Happy to share that @arborday foundation (which works with FAO of UN) has recognised Hyderabad as a Tree city of the world. The only Indian city to be included in this list
This is an acknowledgement of our efforts to improve green cover as part of #HarithaHaaram program 🎄 pic.twitter.com/nflM0svV2k
— KTR (@KTRBRS) February 18, 2021
దీనికి సంబంధించిన వివరాలు స్వయంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. ‘హైదరాబాద్ ను ‘ట్రీ సిటి ఆఫ్ ద వరల్డ్’ గా గుర్తిస్తూ ఆర్బోర్‌డే అందించిన పత్రాలివి. ఈ వార్త మీతో పంచుకోవడానికి ఎంతో ఆనందిస్తున్నాను. ‘ట్రీ సిటి ఆఫ్ ద వరల్డ్’ లిస్ట్‌లో భారత దేశం నుంచి స్థానం లభించిన ఏకైక నగరం హైదరాబాద్ అని చెప్పడానికి నేనెంతో గర్విస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.
Must Read ;- ఆ బుడతడికి కేటీఆర్ ఫిదా!











