రాష్ట్రంలో ప్రతి ఇంటినీ ఇంటర్నెట్ తో అనుసంధానించే కలను త్వరలోనే సాకారం చేస్తామని, ఇందుకు సంబంధించిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తెలిపారు. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాన్యుల సమస్యల పరిష్కారానికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. సాంకేతిక డిజిటల్ సౌకర్యాల కల్పనా రంగంలో తెలంగాణ పురోగమిస్తోందని చెప్పారు. స్విట్జర్లాండ్ రాజధాని దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక శుక్రవారం నిర్వహించిన సదస్సులో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేటీఆర్ పాల్గొన్నారు. ‘భారత్ లో నూతన సాంకేతికతకు ప్రోత్సాహం’ అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్న కేటీఆర్.. తన అభిప్రాయాలను వెల్లడించారు.
Minister @KTRTRS participated in @wef virtual panel session on “Harnessing Emerging Technologies in India”. In his opening remarks, Minister spoke about the steps initiated by Telangana Govt to leverage innovation and emerging technologies in various sectors. pic.twitter.com/cNdWnHBKYe
— KTR, Former Minister (@MinisterKTR) January 29, 2021
‘ఇప్పుడు నడుస్తున్న సాంకేతిక యుగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు సంభవిస్తున్నాయి. సామాన్యుడికి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలన్నది మా సీఎం కేసీఆర్ సంకల్పం. దీనికి అనుగుణంగా తెలంగాణ సాంకేతిక రంగంలో ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో నూతన ఆవిష్కరణలతో పాటు డ్రోన్ల ద్వారా ఔషధాలను మారుమూల ప్రాంతాలకు కూడా చేరవేసే ప్రాజెక్టును ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుబాటులో ఉన్న సాంకేతికతను అందిపుచ్చుకుని వివిధ రంగాల్లో మరింత వేగంగా వృద్ధి సాధించే దిశగా ముందుకెళ్తున్నాం. ఈ దిశగా ఫైబర్ గ్రిడ్ తో అద్భుతాలు ఆవిష్కరిస్తాం. ప్రస్తుత కరోనా నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఎదురుకాబోయే సవాళ్లను సాంకేతికత సాయంతో అధిగమించేందుకు యత్నించాలి’ అని కేటీఆర్ అన్నారు.
Must Read ;- కేసీఆర్ కు మళ్లీ పాలాభిషేకాలు తప్పవంతే!
Minister @KTRTRS participating in a discussion on 'Harnessing Emerging Technologies in India' @wef 2021 https://t.co/4nB5giULhz
— KTR, Former Minister (@MinisterKTR) January 29, 2021











