బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ కు చాలా కాలం తర్వాత వచ్చిన అరుదైన అవకాశంగా ‘అతడు ఆమె ప్రియుడు’ చిత్రాన్ని చెప్పాలి. ఇదే పేరుతో ప్రముఖ నవలా రచయిత ఎప్పుడో రాసిన నవల అది. ఆయనే దీనికి దర్శకత్వం వహిస్తూ ఈ చిత్రాన్ని జనం ముందుకు తీసుకొస్తున్నారు. ఇదో మర్డర్ మిస్టరీ కథ. దర్శకుడిగా తనకు హిట్లు లేకపోవడంతో యండమూరి కూడా కసితో ఈ సినిమాని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే మళ్లీ యండమూరి వైపు చిత్ర పరిశ్రమ చూస్తుంది. లేదంటే ఇంతేసంగతులు.
ఈ సినిమా ఈ ఫిబ్రవరి 4న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కౌశల్ చెప్పిన సింగిల్ టేక్ డైలాగ్ ను ఈరోజు యండమూరి విడుదల చేశారు. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు.
కౌశల్ చెప్పిన సింగిల్ టేక్ డైలాగు టీజర్ ను 02.02.22.మధ్యాహ్నం.02గం.02.నిమిషాలకు చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్ ను కౌశల్ అంతే అద్భుతంగా సింగిల్ టేక్ లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే… ఈ డైలాగ్ ట్రైలర్ ను చిత్ర రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారు. నటుడిగా కౌశల్ కు మంచి భవిష్యత్ ఉందని ఈ సందర్భంగా యండమూరి పేర్కొన్నారు.











