ఓటీఎస్ స్కాంలో బలౌతున్న ప్రజలు, ఉద్యోగులు
ఓటీఎస్ అన్నది స్కీం కాదు.. స్కాం అన్నది జగమెరిగిన సత్యమేనని విమక్షలు మండిపడుతున్నాయి. ఓటీఎస్ పేరుతో జగన్ రెడ్డి సాగిస్తున్న వసూళ్ల దందాకు నిరుపేద బ్రతులు ఛిద్రమూతున్నాయి. అలానే తప్పనిసరిగా వసూళ్లు చేయాలని ప్రభుత్వ కింది స్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడిని తీసుకొస్తున్నారు. ఈ ఒత్తిడి తాళ్లలేక అధికారుల్లో కొందరూ ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇదే తరహా సీఎం జగన్ రెడ్డి సొంత జిల్లా కడప, రాజంపేటలో వెలుగుచూసింది. ఉన్నతాధికారులు ఓటీఎస్ పూర్తి చేయాలని వీఆర్వో రాఘవేంద్రను మందలించారు. చెప్పిన సమయానికి టార్గెట్ పూర్తి చేయాలని తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలో అధికారులు తీవ్ర ఒత్తిడి భరించలేక వీఆర్వో రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
రాజంపేట తహసీల్దార్ కార్యాలయం వేదికగా ఆత్మహత్య
రెవిన్యూ అధికారుల విధులు నిత్యం ఉరుకుపరుగుల జీవితం! అటువంటిది జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓటీఎస్ అన్నది అదనపు బాధ్యతలు. అయినా ఉద్యోగులు తమ టార్గెట్స్ ను పూర్తి చేసుకునేందుకు వారి వంతు నిరుపేదలను పీడిస్తునే ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. మరోవైపు ఉద్యోగులను పీక్కుతీనే ఉన్నతాధికారులు దాపురించారు. ప్రతిరోజు టార్గెట్ ఫిక్స్ చేసి, రెవిన్యూ, సచివాలయం సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తునే ఉంటారు. కేవలం ఓటీఎస్ విషయంలో ఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక, మనస్తాపంతో కడప జిల్లా రాజంపేట తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్వో రాఘవేంద్ర తన మణికట్టును బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఓటీఎస్ పనిభారాన్ని పెంచి, దారుణంగా మాట్లాడటం మనోవేదనకు గురిచేస్తోందని రఘవేంద్ర తన సెల్ఫీ వీడియాలో చెప్పుకొచ్చారు. ఉన్నతాధికారులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడి, చేస్తున్నది సరికాదని హితవు పలికారు.
Must Read:-జగన్ రెడ్డికి గుణపాఠం చెప్పేందుకు రోడ్డెక్కిన గురువులు! ఉద్యమించిన ప్యాఫ్టో!!