డార్లింగ్ ప్రభాస్ కీ, ఛార్మీ 9 ఏళ్ల పుత్ర రత్నానికీ సంబంధ ఏమిటో అర్థం కావడం లేదు. మనకు కూడా అంతే అనుకోండి. ఇంతకీ ఆ పుత్ర రత్నం అంటే ఇంకెవరో కాదండీ బాబూ ఓ కుక్క పిల్ల.. అంతే. అంతేనా ఇంకా ఏమైనా ఉందా అంటే ఆ కుక్క పిల్ల డార్లింగ్ ప్రభాస్ వద్దకు ఎలా చేరిందో మాత్రం సస్పెన్సే అనుకోవాలి. బహుశా ఏ కుక్క పిల్లనో ఛార్మి ప్రభాస్ కానుకగా ఇచ్చి ఉండవచ్చు.. అది కూడా ప్రభాస్ లా ఎదిగిపోయి ఉండొచ్చు.
ఇప్పుడా కుక్క పిల్ల రాజాలా బతుకుతోంది. యంగ్ రెబల్ స్టార్ తో ఈ శునకరాజం ప్రభ దేదీప్యమానంగా వెలిగిపోతోందంటే నమ్మండి. అందుకే కాబోలు ఛార్మి ఈరోజు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేయడంతో పాటు ఆమె ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. ‘Darling with my 9 months old baby boy’ అంటూ కామెంట్ చేయడంతో అందరికీ దీని మీద ఆసక్తి మరింత పెరిగిపోయింది.
#Darling with my 9 months old baby boy ♥️
.
.
.#prabhas #alaskanmalamute @puriconnects pic.twitter.com/4Fr10ViBab— Charmme Kaur (@Charmmeofficial) November 10, 2020