మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్ దంపతులు వీడిపోతున్నారు. 27 ఏళ్ల వివాహ బంధాన్ని తెంచుకోబుతున్నారు. భార్య మెలిందా (56) నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్ లో తెలిపారు. ఒకరికిఒకరు చర్చించుకున్న తర్వాతనే విడాకుల నిర్ణయం తీసుకున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. ‘‘27 ఏళ్లలో మేం ముగ్గురు పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దాం. మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాం. జీవితంలోని తర్వాతి దశల్లో దంపతులుగా ఇక కొనసాగలేమని భావించాం. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని బిల్‌గేట్స్ ట్విట్టర్ లో తెలిపారు. అయితే బిల్ గేట్స్ దంపతులు విడిపోతున్నారనే వార్తలు విని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బిల్ గేట్స్ కు ఏమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
జగన్‌కి ఢిల్లీ టెన్షన్..? కేజ్రీవాల్, కవిత అరెస్టులతో వైసీపీలో వణుకు..!!
ఏపీలో అన్ని స్థానాల్లో విజయం మనదే అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఏపీ సీఎం...