సినిమా రంగానికి బూతే ఇప్పుడు భవిష్యత్తుగా ఉన్నట్టుంది. ‘మగువ’ అనే ఓ సినిమా ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. చూస్తే అది మగువ కాదు తెగువ అనుకోవాల్సి వస్తోంది. అందులో అంతా బూతే. బహుశా ఓటీటీని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా తీశారేమో అనిపిస్తోంది. ఈ ట్రైలర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది అరాచకమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సెగలు పుట్టించే ఇలాంటి సన్నివేశాలు అవసరామా అనేది ఒక వర్గం వాదన. కేవలం యూత్ ని టార్గెట్ గా చేసుకుని ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది.
ఆడది అబల కాదు సబల అనే కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఈ ట్రైలర్ నిడివి 1.28 నిముషాలు ఉంటుంది. ట్రైలర్ మొత్తం బూతు సన్నివేశాలతోనే ఉంటుంది. ఇంతకీ ఈ ట్రైలర్ లో ఏముందో చూద్దాం. ఓ సాఫ్ట్ వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆమెను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేస్తారు.
ఆమె ఎలాగో తప్పించుకుంటుంది. ఈ సన్నివేశాలన్నీ బూతుమయమే. చివరిగా ఆమెతో ఓ డైలాగ్ పలికిస్తారు ‘మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి. ఇది నేటి మాట… నా మాట’ అని ఆమె పలికే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. చివరికి ఇలాంటి నీతి వాక్యం మాత్రం మిగులుతుంది. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.