ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నీ విషాదాలే. పలువురు సినీ ప్రముఖులు ఈ ఏడాదిలోనే మరణించారు. ఇక ఈ సంవత్సరం ముగిసిపోతోంది అనుకొనే లోపే .. ఇప్పుడు బాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. ఓ బాలీవుడ్ నటుడికి షూటింగ్ లో ఉండగా బ్రైన్ స్ట్రోక్ వచ్చింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అంటున్నారు. అతడు మరెవరో కాదు. నైంటీస్ లో బాలీవుడ్ కుర్రకారును ‘ఆషీకీ’ అనే మూవీతో ఊపేసిన రొమాంటిక్ హీరో రాహుల్ రాయ్.
ఆ ఒక్కసినిమాతోనూ రాహుల్ బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అలాగే.. అతడితో అదే సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అను అగర్వాల్ కూడా ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. కార్గిల్ లో ఒక సినిమా షూటింగ్ లో ఉండగా.. రాహుల్ రాయ్ కు బ్రైన్ స్ట్రోక్ వచ్చినట్టు గా తెలుస్తోంది. బ్రైన్ స్ట్రోక్ కు కారణం కార్గిల్ లో ఉన్న శీతల వాతావరణమే అని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ముంబై లీలా వతీ హాస్పిటల్ రాహుల్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. అయితే ఇప్పుడు అతడి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన లేదంటున్నారు ఆసుపత్రి వర్గాల వారు. రాహుల్ ట్రీట్ మెంట్ కు స్పందిస్తున్నాడని .. త్వరలోనే కోలుకొనే అవకాశముందని చెబుతున్నారు.










