నందమూరి నటసింహం బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ మూవీ అఖండ. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో సింహా, లెజెండ్ చిత్రాలు రూపొందడం.. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో అఖండ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అఖండ సినిమా అన్నివర్గాల ప్రేక్షకలును ఆకట్టుకుని అద్భుతమైన విజయం సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్స్ రావడం విశేషం. అయితే… అఖండ సినిమా చూసిన తర్వాత దీనికి సీక్వెల్ ఉంటే బాగుంటుందని.. దీనికి తగ్గట్టుగానే బోయపాటి క్లైమాక్స్ ని డిజైన్ చేశారని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఈరోజు అఖండ 50 రోజులు దిశగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా అఖండ సంక్రాంతి సంబరాలు అంటూ ఓ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటు చేశారు.
ఈ వేడుకలో దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ… అఖండ సీక్వెల్ ప్లాన్ ఉందని ప్రకటించి నందమూరి అభిమానులతో పాటు అందరికీ సర్ ఫ్రైజ్ ఇచ్చారని చెప్పచ్చు. అయితే.. ఈ అఖండ సీక్వెల్ ఎప్పుడు ఉంటుంది..? సెట్స్ పైకి ఎప్పుడు వస్తుంది..? అనేది మాత్రం చెప్పలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.











